విరాట్‌ కోహ్లి అంటే పిచ్చి ప్రేమ.. ఇప్పుడవసరమా? | Mrunal Thakur Fires On Getting Viral Her Old Comment Madly in Love with Virat Kohli | Sakshi
Sakshi News home page

Mrunal Thakur: 'విరాట్‌ కోహ్లికి పెద్ద అభిమానిని'.. మండిపడ్డ హీరోయిన్‌

Published Thu, Aug 8 2024 8:56 AM | Last Updated on Thu, Aug 8 2024 10:52 AM

Mrunal Thakur Fires On Getting Viral Her Old Comment Madly in Love with Virat Kohli

హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌కు క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి అంటే ఇష్టం. తనంటే పిచ్చి అని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అయితే కొందరు ఆ పాత కామెంట్లను తిరిగి వైరల్‌ చేస్తున్నారు. దీనిపై మృణాల్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. దాన్ని మళ్లీ ప్రచారం చేయొద్దని కోరింది.

మృణాల్‌ అసహనం
ఓ మీడియా పోర్టల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో మృణాల్‌కు.. విరాట్‌ కోహ్లి అంటే ఎంతిష్టమో రాసుకొచ్చింది. ఎప్పుడో చెప్పినదాన్ని ఇప్పుడు మళ్లీ తెరపైకి తీసుకురావడం బ్యూటీకి నచ్చలేదు. వెంటనే ఆ పోస్టు కింద చాలు, ఇకనైనా ఆపేయండి అని కామెంట్‌ చేసింది.

లైవ్‌ మ్యాచ్‌
కాగా గతంలో జెర్సీ సినిమా ప్రమోషన్స్‌లో మృణాల్‌ ఠాకూర్‌ క్రికెట్‌పై ఉన్న ఇష్టాన్ని బయటపెట్టింది. నా సోదరుడికి క్రికెట్‌ అంటే పిచ్చి.. అలా నేను కూడా ఈ క్రీడను చూసి ఎంజాయ్‌ చేయడం మొదలుపెట్టాను. ఐదేళ్ల క్రితం తనతో కలిసి స్టేడియంలో లైవ్‌ మ్యాచ్‌ చూశాను. బ్లూ జెర్సీ వేసుకుని టీమిండియాకు సపోర్ట్‌ చేశాను.

క్రీడా నేపథ్యంలో..
అలా విరాట్‌ కోహ్లిని పిచ్చిగా ప్రేమించిన రోజులున్నాయి. ఈరోజు నేను క్రికెట్‌ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలో భాగమైనందుకు సంతోషంగా ఉంది అని పేర్కొంది. తెలుగు జెర్సీకి రీమేక్‌గా తెరకెక్కిన ఈ హిందీ మూవీలో షాహిద్‌ కపూర్‌ హీరోగా నటించాడు. ఇకపోతే మృణాల్‌ చివరగా ఫ్యామిలీ స్టార్‌ మూవీలో హీరోయిన్‌గా నటించింది. కల్కి 2898ఏడీ చిత్రంలో కీలక పాత్రలో కనిపించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement