Barkha Bisht Confirms Divorce From Indraneil Sengupta, Deets Inside - Sakshi
Sakshi News home page

Barkha Bisht-Indraneil Sengupta Divorce: చెరొకరితో డేటింగ్‌! బాలీవుడ్‌ జంట విడాకులు.. జీవితంలోనే కఠిన నిర్ణయమంటూ..

Published Fri, Apr 28 2023 11:23 AM | Last Updated on Fri, Apr 28 2023 12:06 PM

Barkha Bisht Confirms Divorce from Indraneil Sengupta, Calls it Toughest Decision - Sakshi

బాలీవుడ్‌ జంట బర్క బిష్త్‌, ఇంద్రనీల్‌ సేన్‌గుప్తా కొంతకాలంగా దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే! వీరిద్దరూ ఎప్పటికైనా కలిసిపోతారని అనుకుంటున్న సమయంలో శాశ్వతంగా విడిపోవాలని నిశ్చయించుకున్నట్లు తెలిపి ఫ్యాన్స్‌కు షాకిచ్చారు ఈ దంపతులు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాము విడాకులు తీసుకుంటున్నట్లు వెల్లడించింది బర్క. 'అవును, మేము విడాకులు తీసుకుంటున్నాం. త్వరలోనే అందుకు సంబంధించిన పత్రాలు వచ్చేస్తాయి. నా జీవితంలో తీసుకున్న అత్యంత కఠిన నిర్ణయమిదే! నేను ఇప్పుడు సింగిల్‌ మదర్‌ను. నా కూతురు మీరాయే నా సర్వస్వం. ప్రస్తుతం ఓటీటీలో కొన్ని మంచి ప్రాజెక్టులలో నటిస్తున్నాను. టీవీ, సినిమాల్లో అవకాశాలు వచ్చినా చేసేందుకు సిద్ధం' అని చెప్పుకొచ్చింది బర్క.

కాగా బర్క, ఇంద్రనీల్‌.. 'ప్యార్‌ కె దో నామ్‌- ఏక్‌ రాధ, ఏక్‌ శ్యామ్‌' అనే సీరియల్‌లో జంటగా నటించారు. 2007లో వచ్చిన ఈ సీరియల్‌ సెట్స్‌లోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. డ్యాన్స్‌ షో నాచ్‌ బలియే మూడో సీజన్‌లోనూ వీరిద్దరూ జంటగా పాల్గొన్నారు. 2008 మార్చిలో వివాహం చేసుకున్న వీరికి మీరా అనే కూతురు జన్మించింది. ఏమైందో ఏమో కానీ, గత రెండేళ్లుగా వీరిద్దరూ విడివిడిగానే జీవిస్తున్నారు. ఈ క్రమంలోనే విడాకులు తీసుకుంటున్నారు. బర్క.. బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్‌తో పాటు రాజ్‌నీతి వంటి పలు చిత్రాల్లోనూ నటించింది. ఇంద్రనీల్‌.. హిందీ, బెంగాలీ భాషల్లో అనేక సినిమాల్లో నటించాడు. తెలుగులో ఐతే 2లోనూ ముఖ్య పాత్ర పోషించాడు.

ఇకపోతే ఇంద్రనీల్‌ బెంగాలీ నటి ఇషా సాహాతో డేటింగ్‌ చేస్తున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు బర్క కూడా నటుడు ఆశిశ్‌ శర్మతో ప్రేమాయణం సాగిస్తున్నట్లు ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ రిలేషన్‌షిప్‌పై ఇంతవరకు వీరెవరూ స్పందించనేలేదు.

చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన రావణాసుర

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement