Bigg Boss Rahul Mahajan And Natalya Ilina Headed For Divorce After 4 Years Of Marriage - Sakshi
Sakshi News home page

Rahul Mahajan Divorce: రెండు పెళ్లిళ్లు ఫెయిల్‌.. 48 ఏళ్ల వయసులో ముచ్చటగా మూడోసారి విడాకులు..

Published Mon, Jul 31 2023 10:45 AM | Last Updated on Mon, Jul 31 2023 11:13 AM

Rahul Mahajan, Natalya Ilina Headed For Divorce - Sakshi

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌, నటుడు రాహుల్‌ మహాజన్‌ 48 ఏళ్ల వయసులో ముచ్చటగా మూడోసారి విడాకులు తీసుకోనున్నాడు. ఖజకిస్తాన్‌ మోడల్‌, భార్య నటల్య ఇలినాతో విడిపోయేందుకు సిద్ధమయ్యాడు. ఈ జంట గతేడాది విడాకుల కోసం దరఖాస్తు చేసిన విషయం ఇప్పుడు బయటపడింది. నాలుగేళ్లుగా వివాహబంధంలో ఉన్న జంటకు ఆది నుంచి మనస్పర్థలు తలెత్తగా.. వీలైనంత వరకు కలిసి ఉండేందుకే వారు ప్రయత్నించారని తెలుస్తోంది. అయితే కలిసుండి కొట్లాడటం కన్నా విడిపోవడమే మంచిదని వారు విడాకులకు దరఖాస్తు చేసినట్లు సమాచారం. మరి విడాకులు మంజూరయ్యాయా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

మూడోసారి విడాకులు
కాగా రాహుల్‌ 2006లో శ్వేతా సింగ్‌ను పెళ్లాడాడు. వీరిద్దరూ కేవలం రెండేళ్లపాటే కలిసుండగా తర్వాత విడిపోయారు. అనంతరం ఇతడు.. రాహుల్‌ దుల్హానియా లేజాయేగా అనే రియాలిటీ షోలో డింపీ గంగూలీని కలిశాడు. ఈ షోలోనే ఆమెతో ప్రేమలో పడ్డ అతడు 2010లో పెళ్లి చేసుకున్నాడు. కానీ వీరి సంసార జీవితం కూడా సవ్యంగా సాగలేదు. 2015లో వీరు చెరోదారి చూసుకున్నారు. ఆ తర్వాత 2019లో నటాషాను పెళ్లాడాడు. వీరిద్దరూ స్మార్ట్‌ జోడీ అనే షోలో కూడా పాల్గొన్నారు. ఇప్పుడు ఈ బంధం కూడా వర్కవుట్‌ కాకపోవడంతో విడాకులకు రెడీ అయ్యాడు.

ఎవరికీ చెప్పాలనుకోవడం లేదు
అయితే ఈసారి రాహుల్‌ ఈ బాధను తట్టుకోలేకపోయాడని తెలుస్తోంది. తనకు పెళ్లిబంధమే అచ్చిరావట్లేదని సన్నిహితులతో వాపోయాడట! ఇప్పుడిప్పుడే ఈ బాధ నుంచి తేరుకుని తిరిగి తన వర్క్‌పై దృష్టి పెడుతున్నాడట! ఈ విడాకుల వార్త గురించి రాహుల్‌ను ప్రశ్నించగా అతడు స్పందిస్తూ.. 'నా వ్యక్తిగత విషయాన్ని అందరికీ చెప్పడం నాకిష్టం లేదు. నా జీవితంలో ఏం జరుగుతుందనేది ఎవరికీ చెప్పాలనుకోవడం లేదు. నేనిప్పుడేదీ మాట్లాడలేను' అని చెప్పుకొచ్చాడు.

చదవండి: సెంచరీ కొట్టిన మ్యూజిక్‌ డైరెక్టర్‌.. హీరోగా కొత్త సినిమా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement