Bengali Actor Mainak Banerjee Wife Aishwarya Harassed At Kolkata Airport - Sakshi
Sakshi News home page

Mainak Banerjee: ఎయిర్‌పోర్ట్‌లో గొడవ.. నటుడి భార్యతో అసభ్యంగా!

May 28 2023 7:38 PM | Updated on May 29 2023 10:46 AM

Bengali actor Mainak Banerjee wife Aishwarya harassed at Kolkata airport - Sakshi

ప్రముఖ బెంగాలీ నటుడు మైనాక్ బెనర్జీకి చేదు అనుభవం ఎదురైంది. విమానాశ్రయంలో అతని భార్యను రిసీవ్ చేసుకోవడానికి వెళ్లగా అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది గొడవ పెట్టుకున్నారు.  కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. అయితే గొడవకు సంబంధించి ఫేస్‌బుక్‌ లైవ్‌లో మొత్తం ఎపిసోడ్‌ను వివరించాడు బెనర్జీ. 

(ఇది చదవండి: దుమ్ములేపుతున్న 2018 మూవీ.. రెండు రోజుల కలెక్షన్స్‌ ఎంతంటే..)

ఆ తర్వాత బెనర్జీ మాట్లాడుతూ..' నా భార్య చెన్నై నుంచి విమానాశ్రయానికి వచ్చింది. ఆమె కోసం కారు తీసుకుని గేట్ వద్దకు వెళ్లా. అయితే నా వాహనాన్ని అక్కడి నుంచి తొలగించాలని పోలీసు నాకు చెప్పాడు.  అక్కడే చాలా వాహనాలు ఉన్నాయని.. అయితే పోలీసులు వారిలో ఎవరికీ చెప్పలేదు. అంతే కాకుండా నా భార్యతో అసభ్యంగా ప్రవర్తించారు. అందుకే నేను కారు నుంచి దిగాల్సి వచ్చింది.' అని అన్నారు. 

(ఇది చదవండి: లగ్జరీ కారు కొనుగోలు చేసిన స్టార్ హీరో.. ఎన్ని కోట్లంటే?)

అసలేం జరిగిందంటే.. 

తన భార్య ఐశ్వర్యను రిసీవ్ చేసుకునేందుకు ఎయిర్‌పోర్ట్ గేటు ముందు మైనాక్ బెనర్జీ కారు ఆపాడు. అతని భార్య లగేజీ ఎక్కువగా ఉండడంతో కొంత సమయం పట్టింది. దీంతో అక్కడే విధుల్లో ఉన్న పోలీసు భద్రతా సిబ్బంది కారు త్వరగా తీయాలని చెప్పారు. అదే ఇరువురి మధ్య గొడవకు దారి తీసింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement