Abhishek Chatterjee Passed Away: Bengali Actor Abhishek Chatterjee Passed Away - Sakshi
Sakshi News home page

చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత

Published Thu, Mar 24 2022 11:21 AM | Last Updated on Thu, Mar 24 2022 11:48 AM

Bengali Actor Abhishek Chatterjee Passes Away - Sakshi

Abhishek Chatterjee Passed Away: చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ బెంగాలి నుటుడు అభిషేక్‌ ఛటర్జీ(58) కన్నుముశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం(మార్చి 24) రాత్రి తుదిశ్వాస విడిశారు. అయితే ఆయన మరణానికి అసలు కారణం మాత్రం ఇప్పటివరకు కుటుంబ సభ్యులు వెల్లడించకపోవడం గమనార్హం. 1985లో పాత్‌భోలా సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన అభిషేక్ ఛటర్జీ.. బెంగాలిలో దాదాపు వందకి పైగా చిత్రాల్లో నటించారు. ఓరా చార్జోన్, తుమీ కోటో సుందర్, సురర్ ఆకాశే, తూఫాన్, మర్యాద, అమర్ ప్రేమ్ లాంటి చిత్రాలు అభిషేక్‌కు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టాయి.

కేవలం వెండితెరపైనే కాకుండా.. బుల్లితెరపై కూడా తనదైన ముద్రవేశాడు. ఒకవైపు సినిమా చేస్తూనే.. మరోవైపు టీవీ సీరియళ్లలో నటించారు. అభిషేక్‌ మృతితో బెంగాలి చిత్రపరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎన్నో వందల సినిమాల్లో అలరించిన నటుడు కళ్ల ముందు లేడనే విషయాన్ని తెలుసుకుని బాధ పడుతున్నారు అభిమానులు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు పలువురు సీనీ, రాజకీయ ప్రముఖలు అభిషేక్‌ మృతి పట్ల సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement