ప్రతీకాత్మక చిత్రం
కోల్‌కతా: డెల్టాప్లస్ వేరియంట్, థర్డ్‌వేవ్ భయాల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జూలై 15 వరకు లాక్‌డౌన్ నిబంధనలు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేసింది. తాజా నిబంధనల ప్రకారం.. బ్యూటీ పార్లర్లు, సెలూన్లు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. అదే విధంగా కార్యాలయాల్లో 50 శాతం హాజరుతో ఉద్యోగులు విధులు నిర్వర్తించవచ్చు.
అయితే, వ్యాక్సిన్ వేయించుకున్న వారు మాత్రమే ఆఫీసుకు రావాలి. ఇక బజార్లు, మార్కెట్లు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తెరచుకోవచ్చు. ఇతర షాపులు ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచేందుకు అనుమతి ఉంటుంది.
►ఉదయం 6 నుంచి 10 గంటల వరకు, మరలా సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు 50 శాతం మందితో జిమ్‌లు నిర్వహించుకోవచ్చు.
►ప్రభుత్వ, ప్రైవేటు బస్సులను 50 శాతం ఆక్యుపెన్సీతో నడుపవచ్చు.
►కార్యాలయాలు 50 శాతం ఉద్యోగులతో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేయవచ్చు.
►బ్యాంకులు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తెరిచి ఉంటాయి.
►అయితే, రైళ్ల రాకపోకలపై మాత్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు
పశ్చిమ బెంగాల్‌లో గడిచిన 24 గంటల్లో 1836 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 2,022 మంది కోవిడ్ నుంచి కోలుకోగా, 29 కరోనా మరణాలు సంభవించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 21,884 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
చదవండి: Nirmala Sitharaman: భారీ ఉపశమన చర్యలు
Delta Variant: మళ్లీ కఠిన ఆంక్షలు
Comments
Please login to add a commentAdd a comment