కోల్‌కతా : లాక్‌డౌన్ నిబంధనలను పాటించాలని చెప్పినందుకు.. పోలీసులపై స్థానికులు రాళ్ల దాడికి పాల్పడిన ఘటన పశ్చిబెంగ్‌లోని హౌరాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హౌరాలోని తికియాపారా ప్రాంతంలో జనం భారీగా రోడ్ల మీదకు తరలివచ్చారని పోలీసులుకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. గుంపులుగా ఉంటే కరోనా వ్యాప్తి చెందుతుందని.. సామాజిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. అయినా సరే వారు పట్టించుకోకుండా అలానే రోడ్లపైకి వచ్చారు.
(చదవండి : మేమున్నాం: కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధుడు)
దీంతో పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, స్థానికులు వాగ్వాదం జరిగింది. దీంతో వందలాది మంది స్థానికులు పోలీసులపై దూసుకెళ్లి దాడి చేశారు. రాళ్లు విసిరి.. అక్కడి నుంచి తరిమికొట్టారు. ఈ ఘటనలో ఇద్దరు సిబ్బందికి గాయాలయ్యాయి. అదనపు బలగాలు చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. స్థానికులు దాడిచేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment