
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, మెదక్: జిల్లాలో మరో 81 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. దీంతో కరోనా కేసుల సంఖ్య 1579కు చేరింది. ప్రజలు అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని పేర్కొన్నారు. చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యంపట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఇక ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. తరచూ చేతులను సబ్బుతో శుభ్రం చేసుకుంటే కరోనా బారినపడరని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment