తల్లి మృతితో అనాథలై బిక్కుబిక్కుమంటున్న పిల్లలు
గజ్వేల్: రెక్కలు ముక్కలు చేసుకొని బువ్వ పెట్టి ఆలనాపాలనా చూసే అమ్మను కరోనా మింగేసింది. ఏడాది క్రితమే తండ్రి అనారోగ్యంతో చనిపోగా.. విధి ఆ చిన్నారులపై పగపట్టింది. ఇప్పుడు తల్లిని కూడా దూరం చేసింది. ఐదుగురు పిల్లల భవిష్యత్తును అంధకారం చేసింది. కన్నవాళ్లు లేకపోవడంతో ఇక తమను ఎవరు చూసుకుంటారు.. ఎవరు చదివిస్తారంటూ రోదిస్తున్నారు. గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లి గ్రామానికి చెందిన చిన్ననర్సని యాదయ్య, లక్ష్మి దంపతులు. వారికి ఒక కుమారుడు సతీష్ (19), నలుగురు కూతుళ్లు.. అనూష (16), అశ్విని (15), మేనక (11), స్పందన (6) ఉన్నారు.
ఈ కుటుంబానికి రెక్కల కష్టమే జీవనాధారం. చిన్నపాటి పెంకుటిల్లు మాత్రమే వీరికున్న ఆస్తి. ఏడాది క్రితం యాదయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో పిల్లల పోషణ భారం లక్ష్మిపై పడింది. కూలీ పనులకు వెళ్తూ పిల్లలను పోషించుకునేది. కుటుంబ పరిస్థితుల కారణంగా కుమారుడు సతీష్ కొద్దిరోజుల నుంచి బైక్ రిపేర్ పని నేర్చుకుంటున్నాడు. ఈ క్రమంలో లక్ష్మికి 14 రోజుల క్రి తం కరోనా పాజిటివ్‌గా తేలింది. సిద్దిపేట ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించింది. ఇప్పుడు చెల్లెళ్లను చూసుకోవాల్సిన భారం సతీష్‌పై పడింది.
చదవండి: Gandhi Hospital: కరోనా విధుల్లో కాబోయే అమ్మలు
Comments
Please login to add a commentAdd a comment