
సాక్షి, సిద్దిపేట: కరోనా మహమ్మారితో ప్రజలు అతలాకుతలం అవుతున్న వేళ.. సిద్దిపేట జిల్లా ప్రజానీకానికి మంత్రి హరీశ్‌రావు శుభవార్త అందించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆస్పత్రిల్లో ఆక్సిజన్ అందుబాటులో ఉండే విధంగా సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లా కేంద్రాలతో పాటు సిద్దిపేట జిల్లా గజ్వేల్, సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. గురువారం అధికారుల బృందం స్థలాన్ని పరిశీలించింది. ఈ ప్లాంట్లు మూడు నెలల్లో అందుబాటులోకి రానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment