సాక్షి, మర్కూక్(గజ్వేల్): సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ వ్యవసాయక్షేత్రంలో పనికి వెళ్లిన యువకుడు మూర్ఛ వ్యాధితో బావిలో పడి మృతిచెందాడు. వర్ధరాజ్‌పూర్‌కు చెందిన ఆర్.ఆంజనేయిలు(19) కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కూలి పనులు చేస్తున్నాడు. మంగళవారం ఉదయం కొంతమంది కూలీలతో కలసి ఫామ్‌హౌస్‌కు వచ్చాడు. పెద్దబావి పక్కన ముళ్లపొదలను తొలగిస్తుండగా మూర్ఛ రావడంతో అందులోకి జారిపడ్డాడు. పక్కనే ఉన్న కూలీలు పనిలో నిమగ్న మై అతడిని గమనించలేదు.
ఎంతకీ కనిపించకపోవడంతో బావిలో పడిఉండొచ్చని భావించి కుటుంబసభ్యులకు తెలిపారు. సాయంత్రం గజ ఈతగాళ్లతో బావినీటిలో గాలించినా ఫలితం లేకపోయింది. బుధవారం మళ్లీ గజ ఈతగాళ్లు బావిలో గాలింపుచర్యలు చేపట్టగా ఆంజనేయులు మృతదేహం లభించింది. అక్కడే పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. తండ్రి కిష్టయ్య ఫిర్యాదుతో దర్యాప్తు చేస్తున్నట్లు మర్కూక్ పోలీసులు తెలిపారు. మృతుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతూ విలపించారు.
చదవండి: ప్రేమ పేరుతో లొంగదీసుకుని లైంగిక దాడి.. పదేళ్లు శిక్ష..
Comments
Please login to add a commentAdd a comment