
లండన్: పాకిస్తాన్ సంతతికి చెందిన స్కాట్లాండ్ క్రికెటర్, ఆఫ్ స్పిన్నర్ మాజిద్ హక్‌కు కోవిడ్–19 వైరస్ సోకింది. 37 ఏళ్ల మాజిద్ స్వయంగా ఈ విషయాన్ని శుక్రవారం ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. ప్రస్తుతం తాను స్కాట్లాండ్ రాజధాని గ్లాస్గోలోని రాయల్ అలెగ్జాండ్రా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నానని... త్వరలోనే పూర్తి స్థాయిలో కోలుకొని ఇంటికి తిరిగి వస్తానని అతను ఆశాభావం వ్యక్తం చేశాడు. మాజిద్ 2006 నుంచి 2015 వరకు స్కాట్లాండ్ తరఫున 54 వన్డేలు, 21 టి20 మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో 60 వికెట్లు... టి20ల్లో 28 వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియా–న్యూజిలాండ్ ఆతిథ్యమిచ్చిన 2015 వన్డే ప్రపంచ కప్‌లో చివరిసారి స్కాట్లాండ్‌కు ప్రాతినిధ్యం వహించిన మాజిద్ ప్రస్తుతం స్కాట్లాండ్ దేశవాళీ క్రికెట్‌లో ఆడుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment