ఇటీవల కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందున్న బాలీవుడ్ నటి జోవా మొరానీ మరో రెండు రోజుల్లో డిచ్చార్జ్ అవుతున్నట్లు వెల్లడించారు. ఆదివారం జోవా ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌చాట్‌లో మాట్లాడుతూ.. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. కోవిడ్-19 బారిన పడిన తాను ఎలా కోలుకుంటున్నారో వివరించారు. లైవ్‌లో హీరో వరుణ్ ధావన్ ఎప్పుడు డిచ్చార్జ్ అవుతున్నావని అడగ్గా.. ‘రేపు లేదా ఆ మరుసటి రోజు ఇంటికి వెళ్తానని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను’ అని సమాధానం ఇచ్చారు. (బాలీవుడ్‌లో మరో కరోనా కేసు)
‘నేను ఆసుపత్రిలో చేరిన రెండవ రోజు నుంచే ఆరోగ్యం మెరుగుపడటం ప్రారంభించింది. ఇప్పుడు నా ఆరోగ్యం 40 రెట్లు మెరుగుపడింది. కరోనా వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డ నాకు ఆసుపత్రిలో చేరిన రెండు రోజులకే ఆ సమస్య తగ్గిపోయింది. ప్రస్తుతం కాస్తా జ్వరం, అలసటగా ఉనప్పటికీ.. ముందుకంటే ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాను. నేను ఆసుపత్రిలో చేరడం మంచిదైంది. వెంటనే కోలుకుంటున్నానన్న భావన కలిగింది. ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో ఇంటికి వెళ్లగలను. కరోనా వల్ల మొదట నాకు తెలికపాటి జ్వరం, శ్వాస ఇబ్బందులు వచ్చాయన్నారు. అయితే అవి భరించేంత స్థాయిలో ఉన్నప్పుడే ఆసుపత్రిలో చేరాను. మా ఇంట్లో మొదట కరోనా లక్షణాలు కనిపించిన వ్యక్తి నా సోదరి షాజా’ అని కూడా ఆమె చెప్పారు. (కుప్పలుగా శవాలు.. అక్కడే ఎందుకు ఎక్కువ మరణాలు?)
ఇక తన తల్లి జరకి కూడా కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా ఆమె నెగిటివ్ వచ్చిందని, తన సోదరి షాజాకు చికిత్స సమయంలో రెండుసార్లు పరీక్షించగా కోవిడ్-19 నెగిటివ్ రావడంతో ఆమెను డిచ్చార్జ్ చేసినట్లు జోవా వెల్లడించారు. కాగా జోవాతో పాటు తన తండ్రి, బాలీవుడ్ నిర్మాత కరీం మొరానీతో పాటు తన సోదరి షాజాకి కూడా కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. కాగా చికిత్స అనంతరం కరోనా నెగిటివ్ రావడంతో జోవా సోదరి షాజా ఇటివల డిచ్చార్జ్ అయ్యారు. (నిర్మాత కరీమ్‌కు కరోనా)
Comments
Please login to add a commentAdd a comment