రజనీకాంత్‌కి కరోనా | Rajinikanth tested positive for corona Rohit Roy trolled for this post | Sakshi
Sakshi News home page

రజనీకాంత్‌కి కరోనా

Published Sun, Jun 7 2020 3:52 AM | Last Updated on Sun, Jun 7 2020 3:52 AM

Rajinikanth tested positive for corona Rohit Roy trolled for this post - Sakshi

రజనీకాంత్‌,రోహిత్‌ రాయ్‌

‘‘రజనీకాంత్‌ని మేం దేవుడిలా భావిస్తాం, ఆయన గురించి సరదాగా జోకులు వేసినా ఊరుకోం, నీది చాలా బ్యాడ్‌ టేస్ట్‌ కాబట్టే ఇలాంటి పిచ్చి జోక్‌ వేశావ్, కరోనా అనేది కామెడీ కాదు, ఇలాంటి జోక్‌ వేయడం భారతీయ సంస్కృతి కాదు. ఇంకోసారి ఇలా చేశావంటే జాగ్రత్త’’ అంటూ బాలీవుడ్‌ నటుడు రోహిత్‌ రాయ్‌ పై నెటిజన్లు మండిపడ్డారు. శనివారం రోహిత్‌ పై తిట్ల వర్షం కురిపించారు రజనీ అభిమానులు. దానికి కారణం ‘రజనీకాంత్‌కి కరోనా పాజిటివ్‌ వచ్చింది. కానీ కరోనానే క్వారంటైన్‌లో ఉంది’ అని తన ఇన్‌ స్టాగ్రామ్‌లో రోహిత్‌ పెట్టిన పోస్ట్‌.

రజనీకి కరోనా వస్తే అదే నిర్భందంలో ఉండాలి తప్ప రజనీకేం కాదు అనేది అతని పోస్ట్‌ అర్థం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే సూపర్‌ స్టార్‌పై వేసిన ఈ జోక్‌ ఆయన అభిమానులకు మింగుడుపడక, రోహిత్‌ రాయ్‌ పై మండిపడ్డారు. ‘‘నవ్వించడానికి చేశాను. అయితే అది ఇలా అవుతుందనుకోలేదు. క్షమించండి. కానీ ఇది చెత్త జోక్‌ అని నేను అనుకోవడంలేదు. ఇది టిపికల్‌ రజనీ సార్‌ జోక్‌. ఒకర్ని కామెంట్‌ చేసే ముందు అసలు వాళ్లు ఏ ఉద్దేశంతో అన్నారో ఒకసారి ఆలోచించాలి. మీరందరూ నన్ను బాధపెట్టడానికి మెసేజులు పోస్ట్‌ చేస్తున్నట్లు మిమ్మల్నందర్నీ బాధపెట్టడానికి నేను ఆ జోక్‌ వేయలేదు’’ అని రోహిత్‌ రాయ్‌ పోస్ట్‌ చేశాడు. ఉద్దేశం ఏదైనా ఎవరిపై జోక్‌ వేస్తున్నామనేది ముఖ్యం అని కొందరు అంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement