Rohit Roy
-
‘లైగర్’ మూవీకి రమ్యకృష్ణ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా లైగర్. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఎన్నో అంచనాల మధ్య నిన్న(ఆగస్టు 25న) ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ చిత్రం యావరేజ్ టాక్‌ను తెచ్చుకుంది. రిలీజ్‌కు ముందు చేసిన ప్రచార కార్యక్రమాలు, పాటలు, ట్రైలర్‌తో సినిమాపై హైప్ క్రియేట్ చేశారు. అయితే అదేక్కడ సినిమాలో కనిపించలేదని అంటున్నారు ప్రేక్షకులు. చదవండి: అనసూయ, విజయ్ ఫ్యాన్స్ మధ్య ట్విటర్ వార్, తగ్గేదే లే అంటున్న యాంకరమ్మ ఇక ఏదేమైన పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా యావరేజ్ టాక్‌ను తెచ్చుకుంది. ఈ క్రమంలో మూవీ బడ్జెట్, హీరోహీరోయిన్ల రెమ్యునరేషన్ హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ఈ లైగర్‌ను భారీ తారాగణంతో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. లీడ్ రోల్స్‌తో పాటు లైగర్‌లో ప్రధాన పాత్రలు పోషించిన సీనియర్ నటి రమ్యకృష్ణ, మైక్ టైసన్‌ల పారితోషికంపై కూడా ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమాకు విజయ్ రూ. 35 కోట్లు తీసుకున్నట్లు ఇప్పటికే వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. చదవండి: ఒక్క సినిమాకే భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన ‘సీత’? అవాక్కవుతున్న నిర్మాతలు! ఈ రూమర్స్ ప్రకారం విజయ్ ఈ మూవీకి రూ. 35 కోట్ల పారితోషికం తీసుకున్నాడట. ఇక విజయ్ తల్లిగా.. పవర్ఫుల్ మదర్‌గా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన రమ్యకృష్ణ కోటీ రూపాయలు తీసుకోగా.. కోచ్‌గా కనిపించిన రోనిత్ రాయ్ రూ. 1.5 కోట్లు తీసుకున్నాడట. ఇక హీరోయిన్గా ఈ సినిమాలో అందాలు ఆరబోసిన అనన్య పాండే కూడా బాగానే చార్జ్ చేసిందట. ఈ సినిమాకు ఆమె రూ. 3 కోట్లు అందుకుందని సమాచారం. ఇక సినిమాకు హైలెట్ రోల్‌గా మొదటి నుంచి పేరు తెచ్చుకు మైక్ టైసన్ విజయ్ కంటే ఎక్కువగా రూ. 40 కోట్లు అందుకున్నాడని తెలుస్తోంది. -
రజనీకాంత్‌కి కరోనా
‘‘రజనీకాంత్‌ని మేం దేవుడిలా భావిస్తాం, ఆయన గురించి సరదాగా జోకులు వేసినా ఊరుకోం, నీది చాలా బ్యాడ్ టేస్ట్ కాబట్టే ఇలాంటి పిచ్చి జోక్ వేశావ్, కరోనా అనేది కామెడీ కాదు, ఇలాంటి జోక్ వేయడం భారతీయ సంస్కృతి కాదు. ఇంకోసారి ఇలా చేశావంటే జాగ్రత్త’’ అంటూ బాలీవుడ్ నటుడు రోహిత్ రాయ్ పై నెటిజన్లు మండిపడ్డారు. శనివారం రోహిత్ పై తిట్ల వర్షం కురిపించారు రజనీ అభిమానులు. దానికి కారణం ‘రజనీకాంత్‌కి కరోనా పాజిటివ్ వచ్చింది. కానీ కరోనానే క్వారంటైన్లో ఉంది’ అని తన ఇన్ స్టాగ్రామ్‌లో రోహిత్ పెట్టిన పోస్ట్. రజనీకి కరోనా వస్తే అదే నిర్భందంలో ఉండాలి తప్ప రజనీకేం కాదు అనేది అతని పోస్ట్ అర్థం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే సూపర్ స్టార్‌పై వేసిన ఈ జోక్ ఆయన అభిమానులకు మింగుడుపడక, రోహిత్ రాయ్ పై మండిపడ్డారు. ‘‘నవ్వించడానికి చేశాను. అయితే అది ఇలా అవుతుందనుకోలేదు. క్షమించండి. కానీ ఇది చెత్త జోక్ అని నేను అనుకోవడంలేదు. ఇది టిపికల్ రజనీ సార్ జోక్. ఒకర్ని కామెంట్ చేసే ముందు అసలు వాళ్లు ఏ ఉద్దేశంతో అన్నారో ఒకసారి ఆలోచించాలి. మీరందరూ నన్ను బాధపెట్టడానికి మెసేజులు పోస్ట్ చేస్తున్నట్లు మిమ్మల్నందర్నీ బాధపెట్టడానికి నేను ఆ జోక్ వేయలేదు’’ అని రోహిత్ రాయ్ పోస్ట్ చేశాడు. ఉద్దేశం ఏదైనా ఎవరిపై జోక్ వేస్తున్నామనేది ముఖ్యం అని కొందరు అంటున్నారు. -
రజనీకాంత్ ఫ్యాన్స్ ఆగ్రహం
సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కరోనా బారిన పడినట్లు బాలీవుడ్ నటుడు రోహిత్ రాయ్ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. దీంతో ఒక్క క్షణం పాటు ఆయన అభిమానులందరూ తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే అది అబద్ధమని తెలియడంతో ఊపిరి పీల్చుకున్న తలైవా అభిమానులు రోహిత్‌పై మండిపడుతున్నారు. కాగా నటుడు రోహిత్ రాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో "రజనీకాంత్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. కానీ కరోనా క్వారంటైన్లో ఉంది" అని పోస్ట్ పెట్టాడు. (సూపర్‌స్టార్‌కు దీటుగా ఇళయ దళపతి? ) తొలుత ఇది చదివి కలవరపడ్డ నెటిజన్లు అది జోక్ అని అర్థమై నటుడిని తిట్టిపోస్తున్నారు. 'జోక్ చెత్తగా ఉంది', 'ఇలాంటి జోక్ భారతీయ సంస్కృతి కాదు', 'కరోనా కామెడీ కాదు, ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయకండి' అంటూ విమర్శించారు. ఈ ట్రోలింగ్‌పై స్పందించిన రాయ్ 'ఎందుకంత ఆవేశపడుతున్నారు. మిమ్మల్ని నవ్వించాలనుకున్నాను. కానీ ఇలా అవుతుందనుకోలేదు, అందుకు క్షమించండి' అంటూ సమాధానమిచ్చాడు. (కరోనాపై పోరాటం: సూపర్ స్టార్ల షార్ట్‌ఫిల్మ్) -
భారతీయుడిని అయినందుకు చిరాగ్గా ఉంది!
ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించిన ’పద్మావతి’ సినిమా వివాదం దేశాన్ని కుదుపుతూనే ఉంది. ఇప్పటికే ఈ సినిమా విడుదలను పంజాబ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు నిషేధించగా.. తాజాగా మహారాష్ట్ర సర్కారు కూడా ఇదే నిర్ణయం తీసుకునే అవకాశం కన్పిస్తోంది. ఇక ’పద్మావతి’ సినిమా వివాదం నేపథ్యంలో భన్సాలీ, దీపిక తలలు నరికితే.. నజరానా ఇస్తామంటూ ప్రకటనలు వెలువడటంపై ప్రముఖ నటుడు రోహిత్ రాయ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో నెలకొన్న అసహనం, అనాగరిక సంస్కృతికి ’తలల నరికివేత’ ప్రకటనలు అద్దం పడుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల నడుమ ఒక భారతీయుడిగా భారత్‌లో నివసిస్తున్నందుకు తనకు బాధగా, చిరాగ్గా.. ఆవేదనగా ఉందని ఆయన ట్వీట్ చేశారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఈ సినిమా వివాదంపై మరోసారి స్పందిస్తూ.. భన్సాలీ స్వయంగా ఇబ్బందులు కొనితెచ్చుకున్నారని అన్నారు. భన్సాలీ, దీపిక చంపుతామని బెదిరించిన వారిలాగే భన్సాలీ కూడా నేరస్తుడేనని, ఆయన ప్రజల మనోభావాలను దెబ్బతీశారని అన్నారు. భన్సాలీగానీ, ఇంకా వేరేవారు కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించబోమని పేర్కొన్నారు. -
రెండో పెళ్లి చేసుకుంటున్న రాహుల్ మాజీ భార్య
ముంబై: రాహుల్ మహాజన్ మాజీ భార్య, బిగ్ బాగ్ 8 పోటీదారు డింపీ గంగూలీ(30) పునర్వివాహం చేసుకోసుకోబోతోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించింది. దుబాయ్ వ్యాపారవేత్త రోహిత్ రాయ్ తో నిశ్చితార్థం జరిగిందని తెలిపింది. ఎంగేజ్ మెంట్ ఉంగరం ఫొటోను కూడా ట్విటర్ లో పోస్ట్ చేసింది. కోల్ కతాలో నవంబర్ 27న వీరి వివాహం జరగనుంది. ఇరువురి తరపు కుటుంబ సభ్యులు, సన్నిహితులను మాత్రమే ఆహ్వానించనున్నారు. రాహుల్ మహాజన్ నుంచి విడాకులు తీసుకున్న డింపీ గంగూలీ రెండేళ్లుగా రోహిత్ రాయ్ తో ప్రేమాయణం సాగిస్తోంది. బీజేపీ దివంగత నేత ప్రమోద్ మహాజన్ కుమారుడైన రాహుల్ మహాజన్ ను 2010లో ఆమె పెళ్లాడింది. 2012లో వీరు విడిపోయారు. 2009 నుంచి వీరిద్దరూ కలిసి పలు రియాలిటీ షోల్లో పాల్గొన్నారు. కాగా, రెండో వివాహం చేసుకోబోతున్న డింపీ గంగూలీకి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తన మాజీ భార్యకు రాహుల్ మహాజన్ కూడా శుభాకాంక్షలు చెప్పడం విశేషం. -
అదో గొప్ప అనుభూతి
బుల్లితెరపై నటించడం గొప్ప అనుభూతి అని వర్ధమాన నటుడు రోహిత్‌రాయ్ పేర్కొన్నాడు. అవి తనకు కొత్త అనుభవాన్ని ఇస్తున్నాయన్నాడు. ఈ మాధ్యమం వల్ల మంచి ఆదాయం కూడా వస్తుందని టీవీతోపాటు కొన్ని సినిమాల్లో నటించిన రోహిత్ తన మనసులో మాట బయటపెట్టాడు. ‘స్వాభిమాన్’ ధారావాహిక ప్రాయోజిత కార్యక్రమంద్వారా తన కెరీర్‌ను ప్రారంభించిన రోహిత్... ‘ఝలక్ దిఖ్ లాజా’ అనే డ్యాన్స్ రియాలిటీ షోకి నిర్వాహకుడిగా వ్యవహరించాడు. ప్రస్తుతం ‘ఎన్కౌంటర్’ అనే క్రైమ్ సీరియల్లో ఇన్‌స్పెక ్టర్ మిలింద్ మాండ్లిక్ పాత్రను పోషిస్తున్నాడు. 2000వ సంవత్సరంలో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ధారావాహిక ప్రాయోజిత కార్యక్రమానికి అమితాబ్ నిర్వాహకుడిగా వ్యవహరించిన అనంతరం అనేకమంది సెలబ్రిటీలు ఆయన బాటపట్టారు. ఇటువంటి వారిలో షారుఖ్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, సంజయ్‌దత్, శిల్పాశెట్టి, మాధురి దీక్షిత్, కరణ్ జోహార్, కరిష్మా కపూర్, అక్షయ్కుమార్లతోపాటు అనిల్కపూర్కూడా ఉన్నారు. బాలీవుడ్లో స్టార్డం సాధించిన తర్వాత కూడా వీరంతా బుల్లితెరపైనా తమదైన శైలిలో రాణించారు. ఈ విషయమై రోహిత్ మాట్లాడుతూ ‘టీవీ షోలు నటులకు గొప్ప అనుభూతినిస్తాయి. పరిస్థితుల్లో ఎంతో మార్పు వచ్చింది. టీవీ షోల వల్ల రాబడికూడా భారీగానే వస్తుంది. కేబీసీ గత పది సంవత ్సరాలుగా నడుస్తూనే ఉంది. ఈ షోని ప్రజలు మెచ్చుకున్నారు. దీంతోపాటు బిగ్ బాస్, సరిగమపా, ఇండియన్ ఐడాల్ తదితర షోలు కూడా హిట్ అయ్యాయి. టీవీకి అపారమైన శక్తి కలిగిన మాధ్యమం’ అని అన్నాడు.