రెండో పెళ్లి చేసుకుంటున్న రాహుల్ మాజీ భార్య | Rahul Mahajan's ex-wife to marry again | Sakshi

రెండో పెళ్లి చేసుకుంటున్న రాహుల్ మాజీ భార్య

Oct 15 2015 9:51 AM | Updated on Sep 3 2017 11:01 AM

రోహిత్ రాయ్ తో డింపీ గంగూలీ

రోహిత్ రాయ్ తో డింపీ గంగూలీ

రాహుల్ మహాజన్ మాజీ భార్య, బిగ్ బాగ్ 8 పోటీదారు డింపీ గంగూలీ(30) పునర్వివాహం చేసుకోసుకోబోతోంది.

ముంబై: రాహుల్ మహాజన్ మాజీ భార్య, బిగ్ బాగ్ 8 పోటీదారు డింపీ గంగూలీ(30) పునర్వివాహం చేసుకోసుకోబోతోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించింది. దుబాయ్ వ్యాపారవేత్త రోహిత్ రాయ్ తో నిశ్చితార్థం జరిగిందని తెలిపింది. ఎంగేజ్ మెంట్ ఉంగరం ఫొటోను కూడా ట్విటర్ లో పోస్ట్ చేసింది. కోల్ కతాలో నవంబర్ 27న వీరి వివాహం జరగనుంది. ఇరువురి తరపు కుటుంబ సభ్యులు, సన్నిహితులను మాత్రమే ఆహ్వానించనున్నారు.

రాహుల్ మహాజన్ నుంచి విడాకులు తీసుకున్న డింపీ గంగూలీ రెండేళ్లుగా  రోహిత్ రాయ్ తో ప్రేమాయణం సాగిస్తోంది. బీజేపీ దివంగత నేత ప్రమోద్ మహాజన్ కుమారుడైన రాహుల్ మహాజన్ ను 2010లో ఆమె పెళ్లాడింది. 2012లో వీరు విడిపోయారు. 2009 నుంచి వీరిద్దరూ కలిసి పలు రియాలిటీ షోల్లో పాల్గొన్నారు.

కాగా, రెండో వివాహం చేసుకోబోతున్న డింపీ గంగూలీకి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తన మాజీ భార్యకు రాహుల్ మహాజన్ కూడా శుభాకాంక్షలు చెప్పడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement