
సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కరోనా బారిన పడినట్లు బాలీవుడ్ నటుడు రోహిత్ రాయ్ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. దీంతో ఒక్క క్షణం పాటు ఆయన అభిమానులందరూ తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే అది అబద్ధమని తెలియడంతో ఊపిరి పీల్చుకున్న తలైవా అభిమానులు రోహిత్‌పై మండిపడుతున్నారు. కాగా నటుడు రోహిత్ రాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో "రజనీకాంత్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. కానీ కరోనా క్వారంటైన్‌లో ఉంది" అని పోస్ట్ పెట్టాడు. (సూపర్‌స్టార్‌కు దీటుగా ఇళయ దళపతి? )
తొలుత ఇది చదివి కలవరపడ్డ నెటిజన్లు అది జోక్ అని అర్థమై నటుడిని తిట్టిపోస్తున్నారు. 'జోక్ చెత్తగా ఉంది', 'ఇలాంటి జోక్ భారతీయ సంస్కృతి కాదు', 'కరోనా కామెడీ కాదు, ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయకండి' అంటూ విమర్శించారు. ఈ ట్రోలింగ్‌పై స్పందించిన రాయ్ 'ఎందుకంత ఆవేశపడుతున్నారు. మిమ్మల్ని నవ్వించాలనుకున్నాను. కానీ ఇలా అవుతుందనుకోలేదు, అందుకు క్షమించండి' అంటూ సమాధానమిచ్చాడు. (కరోనాపై పోరాటం: సూపర్ స్టార్ల షార్ట్‌ఫిల్మ్)
Comments
Please login to add a commentAdd a comment