How Much Ramya Krishna, Ananya Panday Were Paid Remuneration For LIGER - Sakshi
Sakshi News home page

Ramya Krishna Remunaration For Liger: లైగర్‌లో రమ్యకృష్ణ, అనన్యల రెమ్యునరేషన్‌ ఎంతంటే..

Published Fri, Aug 26 2022 6:52 PM | Last Updated on Sat, Aug 27 2022 8:23 AM

How Much Ramya Krishna, Ananya Panday Were Paid Remuneration For Liger - Sakshi

టాలీవుడ్‌ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ-పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా లైగర్‌. ఈ సినిమా అనౌన్స్‌ చేసినప్పటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఎన్నో అంచనాల మధ్య నిన్న(ఆగస్టు 25న) ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ చిత్రం యావరేజ్‌ టాక్‌ను తెచ్చుకుంది. రిలీజ్‌కు ముందు చేసిన ప్రచార కార్యక్రమాలు, పాటలు, ట్రైలర్‌తో సినిమాపై హైప్‌ క్రియేట్ చేశారు. అయితే అదేక్కడ సినిమాలో కనిపించలేదని అంటున్నారు ప్రేక్షకులు.

చదవండి: అనసూయ, విజయ్‌ ఫ్యాన్స్‌ మధ్య ట్విటర్‌ వార్‌, తగ్గేదే లే అంటున్న యాంకరమ్మ

ఇక ఏదేమైన పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా యావరేజ్‌ టాక్‌ను తెచ్చుకుంది. ఈ క్రమంలో మూవీ బడ్జెట్‌, హీరోహీరోయిన్ల రెమ్యునరేషన్‌ హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ఈ లైగర్‌ను భారీ తారాగణంతో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. లీడ్‌ రోల్స్‌తో పాటు లైగర్‌లో ప్రధాన పాత్రలు పోషించిన సీనియర్‌ నటి రమ్యకృష్ణ, మైక్‌ టైసన్‌ల పారితోషికంపై కూడా ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమాకు విజయ్‌ రూ. 35 కోట్లు తీసుకున్నట్లు ఇప్పటికే వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

చదవండి: ఒక్క సినిమాకే భారీగా రెమ్యునరేషన్‌ పెంచేసిన ‘సీత’? అవాక్కవుతున్న నిర్మాతలు!

ఈ రూమర్స్‌ ప్రకారం విజయ్‌ ఈ మూవీకి రూ. 35 కోట్ల పారితోషికం తీసుకున్నాడట. ఇక విజయ్‌ తల్లిగా.. పవర్ఫుల్‌ మదర్‌గా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన రమ్యకృష్ణ కోటీ రూపాయలు తీసుకోగా.. కోచ్‌గా కనిపించిన రోనిత్‌ రాయ్‌ రూ. 1.5 కోట్లు తీసుకున్నాడట. ఇక హీరోయిన్‌గా ఈ సినిమాలో అందాలు ఆరబోసిన అనన్య పాండే కూడా బాగానే చార్జ్ చేసిందట. ఈ సినిమాకు ఆమె  రూ. 3 కోట్లు అందుకుందని సమాచారం. ఇక సినిమాకు హైలెట్‌ రోల్‌గా మొదటి నుంచి పేరు తెచ్చుకు మైక్‌ టైసన్‌ విజయ్‌ కంటే ఎక్కువగా రూ. 40 కోట్లు అందుకున్నాడని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement