రౌడీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన చిత్రం 'లైగర్'. భారీ అంచనాల నడుమ నిన్న(గురువారం) ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యింది. కానీ సినిమా మాత్రం అనుకున్నంతగా ఆడియెన్స్‌ను మెప్పించలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగానూ నిరాశపరిచింది.
పాన్ ఇండియా స్థాయిలో హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా తొలిరోజు రూ. 12కోట్ల షేర్‌ను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. కానీ నెగిటివ్ టాక్ కారణంగా ఆ టెర్గెట్‌ను లైగర్ అందుకోలేకపోయింది. తొలిరోజు తెలంగాణ, ఏపీలో కలిపి రూ. 9. 57కోట్ల షేర్‌ని మాత్రమే రాబట్టింది.
తెలుగురాష్ట్రాల్లో కలెక్షన్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి...
నైజాంలో రూ. 4.2కోట్లు
సీడెడ్‌లో రూ. 1.32కోట్లు
వైజాగ్‌లో రూ. 1.30కోట్లు
ఈస్ట్‌లో రూ.. 64లక్షలు
వెస్ట్‌లో రూ. 39లక్షలు
కృష్ణలో రూ. 48 లక్షలు
గుంటూరులో రూ. 83లక్షలు
నెల్లూరులో రూ. 40 లక్షల వసూళ్లను రాబట్టింది.
ట్రేడ్ అంచనాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు రూ. 12 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా 15.40 కోట్ల గ్రాస్, రూ. 9.57కోట్ల షేర్‌ను రాబట్టింది. ఓవర్ సీస్ సహా వరల్డ్ వైడ్ గా లైగర్ సినిమా తొలి రోజు 33.12 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ రూ. 90కోట్లు ఉండగా, ఇంకా రూ.76.55 కోట్ల వసూళ్లు రావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment