జనవరిలో ‘తయారీ’కి కొత్త ఆర్డర్ల బూస్ట్‌ | Sakshi
Sakshi News home page

జనవరిలో ‘తయారీ’కి కొత్త ఆర్డర్ల బూస్ట్‌

Published Fri, Feb 2 2024 6:20 AM

Manufacturing activity rises to four month high of 56. 5 in January - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ మొత్తం పారిశ్రామికరంగంలో దాదాపు 70 శాతం వాటా కలిగిన తయారీ రంగం జనవరిలో సానుకూల ఫలితాన్ని నమోదుచేసుకుంది. హెచ్‌ఎస్‌బీసీ ఇండియా మాన్యుఫాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) జనవరిలో 56.5కి ఎగసింది.

ఇది నాలుగు నెలల గరిష్ట స్థాయి. డిసెంబర్‌లో ఈ సూచీ 54.9గా (18 నెలల కనిష్టం) నమోదయ్యింది. ద్రవ్యోల్బణం భయాల ఉపశమనం, డిమాండ్‌ బాగుండడం, కొత్త ఆర్డర్లలో పురోగతి ఇందుకు ప్రధాన కారణంగా నిలిచినట్లు నెలవారీ సర్వే పేర్కొంది. కాగా, ఈ సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగానే పేర్కొంటారు. ఆ దిగువకు పడిపోతేనే క్షీణతగా పరిగణిస్తారు.

Advertisement
 
Advertisement
 
Advertisement