
సాక్షి, బెంగళూరు: జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, ఆయన సతీమణి చెన్నమ్మకు బుధవారం పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. వారిద్దరూ బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవలి కాలంలో తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని దేవెగౌడ కోరారు. తనను కలిసేందుకు రావద్దని సూచించారు. దేవెగౌ డకు ఎలాంటి లక్షణాలు లేకున్నా, టెస్టుల్లో పాజిటివ్‌గా తేలింది. వైద్యుల సూచన ప్రకారం కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారు. దేవెగౌడకు ప్రధాని నరేంద్రమోదీ ఫోన్ చేసి పరామ ర్శించారు. ప్రధాని ఫోన్ చేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. దేవెగౌడ త్వరగా కోలుకోవాలని కోరుతూ సీఎం బీఎస్ యడి యూరప్ప ట్వీట్ చేశారు. ప్రస్తుతం కర్ణాటకలో కరోనా రెండో దశ ఉధృతంగా ఉంది. నిత్యం సుమారు రెండు వేల పాజిటివ్‌లు నమోదవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment