![Kasautii Zindagii Kay Actors Get Covid Tested On Sets After Actor Tests Positive - Sakshi](/styles/webp/s3/article_images/2020/07/13/actor.jpg.webp?itok=tbw7cFjI)
రోజురోజుకు మహమ్మారి విజృంభిస్తోంది. ఉత్తర, దక్షిణాదికి చెందిన టీవీ, చిత్ర పరిశ్రమల్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ బిగ్‌బీ కుటుంబాన్ని కరోనా వెంటాడుతున్న విషయం తెలిసిందే. తాజాగా బుల్లితెరపై కూడా కరోనా కోరలు చాచింది. ‘కసౌతి జిందగీ కే’ సీరియల్ నటుడు పార్థ్ సమాతాన్ తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఆదివారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ‘నేను కోవిడ్ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ తేలింది. నాలో స్వల్ప లక్షణాలు ఉన్నాయి. గత వారం రోజులుగా నన్ను కలిసిన వారంతా ఐసోలేషన్‌కు వేళ్లండి. పరీక్షలు చేయించుకోండి’ అంటూ సమాతాన్ ట్వీట్ చేశాడు. (చదవండి: కపూర్ కుటుంబంలో కరోనా కలకలం!)
ప్రస్తుతం సమాతాన్ ముంబైలోని తన నివాసం సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నాడు. సినిమా, సరీయల్ షూటింగ్స్‌కు ప్రభుత్వం అనుమతించడంతో సమతాన్ తను నటిస్తున్న ‘కసౌద్ జిందగీ కే’ సీరియల్ షూటింగ్‌లో పాల్గొన్నాడు. తన సహా నటులతో కలిసి సెట్స్‌లో సందడి చేసిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. షూటింగ్‌లో సమాతాన్‌తో పాటు ఎరికా ఫెర్నాండేజ్, కరణ్ పటేల్, పూజా బెనర్జీ, భుభావి చోక్సేలు కూడా పాల్గొన్నారు. వారి ఆరోగ్యం పట్ల అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీరియల్ నటీనటులతో పాటు సెట్స్‌లోని సిబ్బందికి దర్శక నిర్మాతలు ఈనెల 12న కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఫలితాలు రావాల్సి ఉంది. (చదవండి: నా భార్యకు కరోనా సోకింది : రతన్ శుక్లా)
Comments
Please login to add a commentAdd a comment