కోహిమా: దేశ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకు కోరలు చాస్తోంది. ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాని నాగాలాండ్‌కు కూడా ఈ మహమ్మారి వ్యాపించింది. నాగాలాండ్‌లో మొట్టమొదటి కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైంది. నాగాలాండ్ దిమాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అనారోగ్యంతో చేరిన రోగికి కోవిడ్-19 లక్షణాలు కనిపించడంతో అతనికి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. (మీరెవరో మీకైనా తెలుసా: ప్రధానిపై ఫైర్!)
దీంతో అతడిని అస్సాంలోని గువాహటి మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని ఆరోగ్య శాఖ మంత్రి హిమాంత బిస్వా శర్మ ఆదివారం రాత్రి ట్విటర్‌లో వెల్లడించారు. అయితే ప్రస్తుతం బాధితుడి ఆరోగ్యం నిలకడగ ఉందని మంత్రి ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా బాధితుడు దిమాపూర్‌కు చెందిని వాడని, అతను మొదట ఆరోనాగ్యం కారణంగా స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్లు అస్సాం ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
ఇక ఆ వ్యక్తికి కోవిడ్ -19 లక్షణాల కనిపించడంతో అతడిని గువాహటి మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఇక ఆదివారం వరకూ నాగాలాండ్‌లో ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు. అయితే అక్కడ ఆదివారం కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో అనుమానం ఉన్న మరో 74 మంది శాంపిల్స్‌ను తీసుకున్నట్లు అధికారుల తెలిపారు. కాగా ఈశాన్య భారతదేశంలో ఇంతవరకు ఒక్క కేసు కూడా నమోదు కాని రాష్ట్రంగా మేఘాలయ నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment