
ఇంఫాల్: మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బిరెన్ సింగ్‌కు కరోనా వైరస్ పాజిటివ్‌గా తెలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఫేస్‌బుక్‌లో ఆదివారం ప్రకటించారు. దీంతో ఇటీవల కాలంలో ఆయనను కలిసిన వారు ఐసోలేషన్‌కు వెళ్లాలని సూచించారు. ‘ఫ్రెండ్స్ నాకు కరోనా పాజిటివ్‌గా తెలింది. కొన్ని రోజులుగా నేను కరోనా లక్షణాలతో బాధపడుతున్న. ఈ నేపథ్యంలో ఆదివారం కోవిడ్ పరీక్షలు చేసుకోగా పాజిటివ్ వచ్చింది. కావున ఇటీవల నన్ను కలిసి వారంతా కోవిడ్ పరీక్షలు చేసుకోవాలని, క్వారంటైన్‌లో ఉండాలని విజ్ఞప్తి’ అంటూ సీఎం తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. అయితే ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలిపారు. కాగా ఇప్పటి వరకు రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో ఆరు కరోనా మృతి కేసులు నమోదు కాగా మరణాల సంఖ్య 213కు చేరుకున్నట్లు ఆరోగ్య శాఖ తాజా హల్త్ బులెటిన్‌లో వెల్లడించింది.
(చదవండి: ప్రముఖ నటుడు కన్నుమూత)
Comments
Please login to add a commentAdd a comment