
పూజా హెగ్డే, ప్రాణాయామం చేస్తూ...
సమయాన్ని వృథా చేయడాన్ని కొందరు హీరోయిన్లు అస్సలు ఇష్టపడరు. ఈ జాబితాలో అగ్ర హీరోయిన్లలో ఒకరైన పూజా హెగ్డే పేరు కచ్చితంగా ఉంటుంది. పూజ చేతిలో ఉన్న అరడజను (‘రాధేశ్యామ్’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ‘ఆచార్య’, ‘సర్కస్’, ‘కభీ ఈద్.. కభీ దీవాలీ’, తమిళ విజయ్‌తో సినిమా) సినిమాలే ఇందుకు నిదర్శనం. ఇటీవలే కరోనా సోకడం వల్ల పూజా హెగ్డే హోమ్ ఐసోలేషన్‌లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. కానీ ఈ టైమ్‌ను కూడా క్వాలిటీగా వినియోగించుకుంటున్నారామె.
వర్చ్యువల్ యోగా సెషన్స్‌లో పాల్గొన్నారు పూజ. అంతేకాదు... ఆన్‌లైన్‌లో ఈ సెషన్స్‌ను షేర్ చేశారీ బ్యూటీ. ‘‘ఈ కోవిడ్ క్లిష్ట పరిస్థితుల్లో అందరూ ప్రాణాయామాన్ని ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రాణాయామం మనకు ఎంతో మేలు చేస్తుంది. మనం మెరుగైన విధంగా శ్వాసను తీసుకోగలిగేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ ప్రాణాయామం వల్ల నేను సరిగ్గా శ్వాస తీసుకోగలుగుతున్నాను’’ అన్నారు పూజా హెగ్డే. దర్శకుడు హరీష్ శంకర్, హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వంటి ప్రముఖులు పూజా ఆన్‌లైన్ సెషన్‌ను ఫాలో అవ్వడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment