సాక్షి, ముంబై: బాలీవుడ్ లవ్ బర్డ్స్ మలైకా ఆరోరా, అర్జున్ కపూర్‌లకు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని వారే స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ క్రమంలో మలైకా కరోనా పరీక్షలకు సంబంధించిన మెడికల్ రిపోర్టు ఫేస్‌బుక్‌తో పాటు పలు సోషల్ మీడియాల్లో చక్కర్లు కొడుతోంది. దీంతో మలైకా సోదరి, నటీ అమ్రితా ఆరోరా దీనిపై అసహనం వ్యక్తం చేశారు. తన సోదరి మెడికల్ రిపోర్టును సోషల్ మీడియాలో షేర్ చేయాల్సిన అవసరం ఏముందని మండిపడ్డారు. దీనివల్ల మీకు వచ్చే ఉపయోగం ఏంటని ప్రశ్నించారు. అలాగే తనకు కరోనా సోకడం సబబేనంటూ పలువురు వ్యాఖ్యనించడం దారుణమన్నారు. (చదవండి: అర్జున్ కపూర్‌కు, మలైకా అరోరాకు కరోనా)
ఇలాంటి సమయంలో తనకు సపోర్టుగా ఉంటూ కోలుకునేలా మద్దతుగా నిలవల్సింది పోయి.. విమర్శలు చేయడం దారుణమని పేర్కొన్నారు. తన మెడికల్ రిపోర్టును షేర్ చేస్తూ మలైకాను కించపరచడం సరికాదని, ఇలాంటి సమయంలో ఇలా చేయడమేంటని అసలు మనుషులకు ఏమైందంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మహమ్మారి నుంచి కోలుకునేందుకు మలైక తగిన జాగ్రత్తలు తీసుకుంటుందని, ఇందుకు తనని తాను తాను సిద్దం చేసుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. కాగా తను కరోనా బారిన పడ్డానని, ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని మలైకా ప్రకటించారు. ప్రస్తుతం తను ఐసోలేషన్‌కు వెళ్లానని, గత కొద్దిరోజులకు తనను కలిసిన వారు హోం క్వారంటైన్‌లో ఉండాలని, కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా మలైకా విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment