సాక్షి, నెల్లూరు: జిల్లాలోని కరోనా పాజిటివ్ వ్యక్తులకు రోబోలతో సేవలు అందించనున్నట్లు అధికారులు మంగళవారం వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో రోబోల సేవలను తొలిసారిగా నెల్లూరులోనే ప్రేవేశపెట్టామన్నారు. కాగా రీజనల్ కోవిడ్ సెంటర్‌లలో ఇకపై రోబోలు సేవలు అందించనున్నాయని చెప్పారు. నెల్లూరుకు చెందిన హెల్పింగ్ హ్యాండ్స్ సేవా సంస్థ నిర్వాహకులు ఈ రోబోను జిల్లా అధికారులకు అందించి దీని పనితీరుపై ఆ సంస్థ నిర్వాహకులు నిజాముద్దీన్ డెమో ఇచ్చారు. (లాక్‌డౌన్: ఇళ్లకు వెళతాం.. వదిలేయండి!)
కాగా డెమోలో రోబో పనిదీరుపై కోవిడ్-19 ప్రత్యేక ఐఏఎస్ అధికారి రామ్ గోపాల్, కలెక్టర్ శేషగిరి బాబు, జేసీ డాక్టర్ వినోద్ కుమార్‌లు పరీశిలించి హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ నిర్వాహకులను అభినందించారు. ఈ రోబో ఒకేసారి దాదాపు 40 కేజీల వరకు మందులు, ఆహారాన్ని పాజిటివ్ వ్యక్తులకు సరఫరా చేస్తుందని అధికారులతో పేర్కొన్నారు. అంతేగాక జిల్లాకు మరో రెండు రోబోలను కూడా అందుబాటులోకి తెస్తామని సంస్థ నిర్వాహకులు నిజాముద్దీన్ అధికారులకు తెలిపారు. (న్యూయార్క్‌లో లాక్‌డౌన్ పొడగింపు!)
Comments
Please login to add a commentAdd a comment