వైద్య పరిశోధనల్లో ఇదో మేలి మలుపు. ప్రమాదరహితమైన వైరస్ లాంటి కణాలు (వీఎల్పీ)లను ఉపయోగించి చికన్గున్యాను నిరోధించడానికి ఓ టీకా కనుగొన్నారు. తొలిదశలో 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న 25 మంది ఆరోగ్యవంతులైన వలంటీర్ల మీద ఈ టీకాను ప్రయోగించారు. ప్రతి వాలంటీర్కు మూడు డోసుల్లో ఈ టీకాలు ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ల రక్తంలో చికన్గున్యాను న్యూట్రలైజ్ చేసే యాంటీబాడీలను పరీక్షించారు. ఈ టీకాలు ఇచ్చిన వారికి ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదు. ఈ విషయాన్ని ప్రఖ్యాత జర్నల్ లాన్సెట్లో ప్రచురించారు.
తొలిసారి టీకా ఇవ్వగానే తీసుకున్న వరిలో న్యూట్రలైజింగ్ యాంటీబాడీల రూపంలో ఒక రోగనిరోధక లక్షణం కనిపించింది. టీకాను అతి తక్కువ డోసులో ఇచ్చినా కూడా ప్రభావం ఉంది. రెండో డోస్ టీకా ఇచ్చేసారికి గ్రహీతలందరికీ పూర్తిస్థాయిలో యాంటీబాడీలు రూపొందాయి. ఇవి ఎక్కువ కాలం పాటు శరీరంలో ఉండటం, టీకా వేసిన ఆరు నెలల తర్వాత కూడా గ్రహీతలందరిలో కనిపించడం సానుకూల లక్షణమని పరిశోధనలకు నేతృత్వం వహించిన జూలీ లెడ్జర్వుడ్ తెలిపారు. ఆమె యూఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్లో పనిచేస్తున్నారు.
చికన్గున్యా నిరోధానికి ఓ టీకా!
Published Fri, Aug 15 2014 2:12 PM | Last Updated on Sat, Sep 2 2017 11:55 AM
Advertisement
Advertisement