
రష్యా ప్రధానమంత్రి మిఖాయిల్ మిషుస్టిన్
మాస్కో: రష్యా ప్రధానమంత్రి మిఖాయిల్ మిషుస్టిన్ కరోనా బారిన పడ్డారు. పరీక్షల్లో తనకు కరోనా పాజిటివ్ అని తేలిందనీ, స్వీయ నిర్బంధంలో ఉంటానని ప్రకటించారు. కీలక అంశాల్లో అందుబాటులో ఉంటానని, ఈ మేరకు అధ్యక్షుడు పుతిన్‌కు సమాచారం ఇచ్చానని వెల్లడించారు. రష్యాలో సాధారణంగా ఆర్థికపరమైన నిర్ణయాలను ప్రధానమంత్రి తీసుకుంటూ అధ్యక్షుడికి జవాబుదారీగా ఉంటారు.
Comments
Please login to add a commentAdd a comment