హాలీవుడ్ సింగర్ రీటా విల్సన్, తన భర్త టామ్ హాంక్స్‌కు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు మంగళవారం ఆమె వెల్లడించారు. మార్చిలో ఆస్ట్రేలియాలో జరిగిన ‘న్యూ గర్ల్’ అల్బమ్ పాటల ప్రదర్శన కార్యక్రమానికి వెళ్లినప్పడు వారిద్దరికీ కరోనా సోకినట్లు తెలిపారు. ప్రస్తుతం మహమ్మారి నుంచి కోలుకున్నామని, తమ ఆరోగ్యం నిలకడగా ఉందని కూడా చెప్పారు. ఈ సందర్భంగా అమెరికాలోని ఓ ఛానెల్ నిర్వహించిన టాక్‌షోలో ఆమె మాట్లాడుతూ.. ఆస్ట్రేలియాలో క్వారంటైన్‌లో ఉన్న తను, తన భర్త హాంక్స్(60) కరోనా వైరస్‌తో ఎలా పోరాటం చేశారో వివరించారు. ‘‘ ఆ సమయంలో నేను చాలా అలసటకు లోనయ్యాను. ఆ తర్వాత తేలికపాటి జ్వరం కూడా ప్రారంభమైంది. ఆహరం రుచిని, వాసనను కూడా కోల్పోవడంతో అసౌకర్యానికి లోనయ్యాను. ఇక అక్కడి ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన 9 రోజులకు జ్వరం తీవ్రత అధికమైంది’ అని చెప్పుకొచ్చారు. అయితే కరోనా తనకు ఎలా వచ్చింది, ఎవరి వల్ల సోకిందనే విషయంపై స్పష్టత లేదని తెలిపారు. (కరోనా కలకలం: నిర్బంధంలోకి సీఎం)
ఈ క్రమంలో మలేరియాను అరికట్టే క్లోరోక్విన్ డ్రగ్‌ను కరోనా వైరస్ చికిత్సలో భాగంగా తీసుకున్నట్లు వెల్లడించారు. ఆ డ్రంగ్ తీసుకున్న తర్వాత తన జ్వరం తగ్గిందని తెలిపారు. అయితే క్లోరోక్విన్ వల్లే తన ఫీవర్ తగ్గిందని ఖచ్చితంగా చెప్పలేన్నారు. ‘ఆ ఔషధం నిజంగా పనిచేసిందా లేదా ఆ సమయంలో కేవలం నా జ్వరాన్ని మాత్రమే తగ్గించిందో నాకు తెలియదు. కానీ అది వాడిన తర్వాత నా జ్వరం తగ్గిపోయింది. అయితే క్లోరోక్విన్ అధిక డ్రగ్‌ను కలిగి ఉండటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. ఇది తీసుకున్న తర్వాత వికారంగా అనిపించింది. ఒక్కోసారి వాంతులు కూడా వచ్చాయి. అంతేగాక నా కండరాలు బలహీనంగా అనిపించి నడవలేక పోయాను’ అని చెప్పారు. (2022 వరకు భౌతిక దూరం పాటిస్తేనే..)
ఇక క్లోరోక్విన్‌పై ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ ఔషధం కరోనా చికిత్సకు ఉపయోగపడుతుందో లేదో కచ్చితంగా చెప్పలేనని పేర్కొన్నారు. ఇక తన భర్త, హాంక్స్ కూడా కరోనా పాజిటివ్ ఉన్నప్పటికీ ప్రస్తుతం భయపడాల్సిన పరిస్థితి రాలేదు. కాస్తా జ్వరంతో ఆసుపత్రిలో చేరిన ఆయన ఐదు రోజుల్లోనే కోలుకున్నారని చెప్పారు.ఆయన ఆస్ట్రేలియాలోని క్వీన్ల్సాండ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తమ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆమె తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment