సాక్షి, ఆర్మూర్‌టౌన్ (నిజామాబాద్): పాప పుట్టి నెల రోజులైనా కాలేదు. తనని కళ్లారా చూసుకుంది లేదు... తనివితీరా ముద్దాడింది లేదు. అంతలోనే ఎవరో దుండగులు తల్లి నుంచి బిడ్డని వేరు చేశారు. తల్లి ఆదమరచి నిద్రిస్తున్న సమయం లో పాపను శిశువును ఎత్తుకుపోయారు. ఆర్మూర్ మండలం పెర్కిట్‌లో గల క్లాసిక్ ఫంక్షన్ హాల్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఎస్సై విజయ్ నారాయణ్ కథనం ప్రకారం.. పెర్కిట్‌కు చెందిన సుమలత 15 రోజుల క్రితం పండంటి ఆడబిడ్డను ప్రసవించింది. శనివారం రాత్రి ఉక్కపోతగా ఉండడంతో పసిబిడ్డతో కలిసి ఇంటి ఎదుట నిద్రకు ఉపక్రమించింది. తెల్లారి లేచి చూసే సరికి శిశువు కనిపించలేదు. అన్ని చోట్ల వెతికినా ఫలితం లేకపోవడంతో బాధితురాలు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కిడ్నాప్ కేసు నమోదుచేసిన పోలీసులు శిశువు కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment