ఆర్మూర్, న్యూస్‌లైన్: నిజామాబాద్ మేయర్, ఆర్మూర్, కా మారెడ్డి, బోధన్ మున్సిపల్ చైర్ పర్సన్‌ల ఎన్నికలు, మండల పరిషత్, జిల్లా పరిషత్ అధ్యక్షుల ఎన్నికలు పరోక్ష పద్ధతిలో నిర్వ హించనున్నారు. అధికారం ఆశిస్తున్నవారికి ఇదే వరంగా మారింది. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జడ్‌పీటీసీ, ఎంపీటీసీ సభ్యులను తమవైపు తిప్పుకునేందుకు వారు పడరాని పాట్లు పడుతున్నారు.
మున్సిపల్, పరిషత్, సార్వత్రి క ఎన్నికల నోటిఫికేషన్లు వెలువడిన నాటినుంచి రా ష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనల మేరకు రాజకీయ నాయకులు ఎన్నికలలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా జిల్లాలోని ఎన్నికల అధికారులు గట్టి చర్యలే చేపట్టారు. అక్రమంగా తరలిస్తున్న డబ్బు, మద్యం నిలువలను స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశారు.
కానీ, పోలింగ్ ముగిసి, ఓట్ల లెక్కింపు పూర్తయి విజేతలను ప్రకటించిన అనంతరం ప్రజా ప్రతినిధులను శిబిరాలకు తరలించడమే కాకుండా, లక్షలు పోసి కొనుగోలు చేస్తున్న విషయా న్ని మాత్రం ఎన్నికల కమిషన్ పట్టించుకోవడం లేద నే విమర్శలు వినిపిస్తున్నాయి. సామాన్య ఓటర్లను రూ. 500తోనో, రూ. వెయ్యితోనో, మద్యంతోనో ప్రలోభాలకు గురి చేస్తేనే తప్పని భావించిన ఎన్నికల కమిషన్ లక్షల రూపాయలు వెచ్చించి క్యాంపులలో ప్రజా ప్రతినిధులకు మద్యం, విందులు ఏర్పాటు చేస్తున్న విషయాలను మాత్రం విస్మరిస్తోందని పలువురు పేర్కొంటున్నారు.
ఇదీ పరిస్థితి
నిజామాబాద్ కార్పొరేషన్, ఆర్మూర్, బోధన్, కామారెడ్డి మున్సిపాలిటీల ఫలితాల అనంతరం మేయ ర్, చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ స్థానాలను ఆశిస్తున్నవారు క్యాంపులను నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 36 మండలాలలో 583 ఎంపీటీసీలు, 36 మంది జడ్‌పీటీసీల ఫలితాల అనంతరం విజేతలను ప్రకటించడంతో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కోసం క్యాంపు రాజకీయాలను ప్రారంభించారు. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జడ్‌పీటీసీలు, ఎంపీటీసీలు ఇతర పార్టీల వైపు వెళ్లకుండా కాపలా కాస్తున్నారు. అందుకు విందులు, వినోదాల రూపంలో లక్షలు ఖర్చు చేస్తున్నారు.
మరి కొందరు ప్రజా ప్రతినిధులను విహార యాత్రలకు పంపిస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్, టీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీల మధ్యనే పోటీ నెలకొని ఉంది. స్పష్టమైన మెజారిటీ సాధించిన ప్రదేశాలలో మినహాయిస్తే హంగ్ ఏర్పడిన స్థానంలోనే అధ్యక్ష పీఠాన్ని ఆశిస్తున్నవారికి ఖర్చు ఎక్కువ అవుతోందని ఆయా పార్టీల నాయకులే స్వయంగా చెప్పుకుంటున్నారు. సొంత పార్టీకి చెందిన కౌన్సిలర్లకు సైతం లక్షల్లో ముట్టజెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. మున్సిపల్ చైర్ పర్సన్ పీఠం కోసం సుమారు రూ. రెండు కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉందని తెలుస్తోంది. దీంతో ఆర్థిక స్థోమత లేని కొందరు నాయకులు పోటీ నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా, దీనిని నియంత్రించడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌గాని, జిల్లా ఎన్నికల అధికారులు కానీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది.
రేసు గుర్రాలకు రేటు!
Published Thu, May 22 2014 2:23 AM | Last Updated on Sat, Sep 2 2017 7:39 AM
Advertisement
Advertisement