ఎమ్మెల్యేపై ఫేస్బుక్లో అభ్యంతరకర వ్యాఖ్యలు | Armoor TRS mal jeevan reddy files defamation case on Facebook postings | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేపై ఫేస్బుక్లో అభ్యంతరకర వ్యాఖ్యలు

Published Thu, Jun 12 2014 1:42 PM | Last Updated on Thu, Jul 26 2018 5:21 PM

ఎమ్మెల్యే  ఆశన్నగారి జీవన్ రెడ్డి - Sakshi

ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి

హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే  ఆశన్నగారి జీవన్ రెడ్డిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. తుమ్మల రమేష్ రెడ్డి అనే వ్యక్తి ఫేస్బుక్లో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయటంతో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సైబరాబాద్ పోలీసులు రమేష్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.

యూఏఈకి చెందిన ఓ బ్యాంక్ నుంచి రుణం తీసుకుని జీవన్ రెడ్డి ఎగవేసినట్లు, అలాగే ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆర్మూరు ప్రజల్ని జీవన్ రెడ్డి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని రమేష్ రెడ్డి ఫేస్ బుక్లో కథనాలు పోస్ట్ చేశాడు. దీంతో తన పరువుకు నష్టం కలిగేలా రమేష్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement