trs mla jeevan reddy
-
‘ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నన్ను వేధించాడు’
చెన్నై : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న మీటూ ప్రకంపనలు తెలంగాణను తాకాయి. టీఆర్ఎస్కు చెందిన ఆర్మూర్ తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డిపైన నటి శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఓ ప్రముఖ తమిళ న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీటూ ఉద్యమం గురించి ఆమె మాట్లాడుతూ..‘ జీవన్ రెడ్డి హైదరాబాద్‌లోని పార్క్‌హయత్ హోటల్లో నాపై వేధింపులకు పాల్పడ్డాడు. అతడికి అమ్మాయిలంటే పిచ్చి. అతడు పెద్ద మోసగాడు. అతనికి నిర్మాత బెల్లంకొండ సురేశ్ సహాయం చేశాడు. అతడు ప్రతి రోజు ఫోన్ చేసి వేధింపులకు పాల్పడేవాడు. తమ పార్టీ అధికారంలో ఉందని బెదిరింపులకు దిగేవాడ’ని పేర్కొన్నారు. గతంలో కూడా శ్రీరెడ్డి పలువురు ప్రముఖులపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. -
ఆలూరు బాధితులను ఆదుకుంటాం
-
అరే ఇదేందన్నా.. ఆపి మరీ తిట్టించుకున్నా..
హైదరాబాద్: అసెంబ్లీలో రూల్సా.. రూల్స్ ప్రకారం సభ నడుస్తోందా అని టీఆర్ ఎస్ ఎమ్మెల్యే ఎ.జీవన్ రెడ్డిని కాంగ్రెస్ సభ్యుడు సంపత్ కుమార్ ప్రశ్నించారు. అసెంబ్లీ లాబీల్లో వీరిద్దరూ పరస్పరం ఎదురుపడ్డారు. సంపత్ ను చూసిన జీవన్ రెడ్డి ఆపారు. ' ఇంత పెద్ద మనిషిని, పైగా రూల్స్ కమిటీ సభ్యుడిని ఎదురుపడ్డా పట్టించుకోకుండా పోతావా' అని సంపత్ ను ప్రశ్నించారు. ' మీ ప్రభుత్వంలో రూల్స్, చట్టాలు ఏమైనా ఇక్కడ ఉన్నాయా? మెజారిటీ ఏమనుకుంటే అవే రూల్స్. మైనారిటీలో ఉన్నవాళ్లు మౌనంగా ఉండాల్సిందే . అందుకే చప్పుడు చేయకుండా పోతన్నాం' అంటూ సంపత్ సరదాగా విమర్శించారు. అరే.. ఇదేందన్నా ఆపి మరీ తిట్టించుకున్నట్లయింది అని జీవన్ నవ్వూతూ వ్యాఖ్యానించారు. -
ఆ రెండు పార్టీలవి శవ రాజకీయాలు
టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్ : టీడీపీ, కాంగ్రెస్‌లు రాష్ట్రంలో శవ రాజకీయాలు చేస్తున్నాయని టీఆర్ఎస్ నేత, ఆర్మూరు ఎమ్మెల్యే ఎ.జీవన్‌రెడ్డి మండిపడ్డారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక ఈ రెండు పార్టీల నాయకులు అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తలారి సత్యం యాక్సిడెంట్‌కు, తనకూ ఎలాంటి సబంధం లేదని వివరించారు. తెలంగాణ భవన్లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కాంగ్రెస్, టీడీపీ నాయకులకు వరుస పరాజయాలతో మైండ్ బ్లాంక్ అయిందని ఎద్దేవా చేశారు. రోడ్డు ప్రమాదాన్ని కూడా హత్యగా చిత్రీకరించి శవ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు ఈ ప్రమాదంపై విచారణ జరిపి యాక్సిడెంట్‌గా తేల్చారని పేర్కొన్నారు. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అబద్ధాలకు తండ్రిలాంటి వాడ ని వ్యాఖ్యానించారు. తాను యాక్సిడెంట్ చేయించినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని, లేదంటే రేవంత్ చేయాలని సవాలు చేశారు. కాంగ్రెస్ నాయకురాలు ఆకుల లలిత భర్త బ్యాంకును మోసం చేసి జైలుకు వెళ్లింది నిజం కాదా అని ప్రశ్నించారు. -
చంద్రబాబుకు జైలుశిక్ష తప్పదు
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో ముమ్మాటికీ సూత్రధారి చంద్రబాబు నాయుడేనని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ కేసులో చంద్రబాబుకు నోటీసులు తప్పవు...జైలు శిక్షా తప్పదని ఆయన గురువారమిక్కడ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో దోచుకున్న డబ్బును రేవంత్ రెడ్డి విడుదల సందర్భంగా ర్యాలీకి ఉపయోగించారని జీవన్ రెడ్డి విమర్శించారు. రేవంత్ ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిన నేరస్తుడు అని ...అలాంటి వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులపై వ్యాఖ్యలు చేయటమా అని మండిపడ్డారు. మోటారు వాహనాల చట్టంలో డ్రైవర్ తప్పు చేస్తే ...ఓనర్‌కు కూడా శిక్ష పడుతుందని, అలాగే ఓటుకు నోటు కేసులో రేవంత్‌తో పాటు చంద్రబాబుకు శిక్ష తప్పదన్నారు. మరికొద్దిరోజుల్లో చంద్రబాబు కూడా ఖచ్చితంగా జైలుకు పోయే అవకాశాలు ఉన్నాయన్నారు.నోరున్నది కదా... అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే జనాలు.. రేవంత్ నాలుక కోస్తారని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. రేవంత్ ఖబడ్దార్ పక్క రాష్ట్రాలకు సద్దులు మోసుకుంటా పోతున్నావు...ఒళ్లు, నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలి.. నోరు పారేసుకుంటే మాత్రం...తెలంగాణ ప్రజలు నీ నోటికి కుట్లు వేస్తారంటూ జీవన్ రెడ్డి మండిపడ్డారు. టీడీపీ ఆట ముగిసిందని, రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ తుడిచిపెట్టుకు పోతుందని జోస్యం చెప్పారు. -
కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా చంద్రబాబుదే...
-
కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా చంద్రబాబుదే...
హైదరాబాద్ : తెలంగాణలో కరెంట్ కష్టాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కారణమని నిజామాబాద్ జిల్లా ఆర్మూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆరోపించారు. ఆయన బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ తెలంగాణలో విద్యుత్ సంక్షోభానికి కథ,స్క్రీన్ ప్లే, నిర్మాత, డైరెక్షన్ ....అంతా చంద్రబాబుదే అన్నారు. ఆంధ్ర బాబులు రిమోట్ నొక్కితే తెలంగాణ అసెంబ్లీలో బొమ్మలు ఆడుతున్నాయన్నారు. మాయల పకీరు ప్రాణం చిలుకలో ఉన్నట్లు ....తెలంగాణ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు ప్రాణాలు ....చంద్రబాబు చేతిలో ఉన్నాయని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రాంత ప్రజల సంక్షేమాన్ని విస్మరించి వారు బాబు డైరెక్షన్లో సభలో చెరోవైపు ప్రభుత్వంపై ఎగరటం సరికాదన్నారు. నీళ్లు, నిధులు, విద్యుత్ అన్ని దోచుకుపోతున్నారనే...తాము తెలంగాణ సాధించుకుంటే ఇప్పుడూ కూడా ఆంధ్రా పెత్తనం చేస్తామంటే సహించేది లేదన్నారు. విద్యుత్ సంక్షోభంపై తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులంతా త్వరలోనే ఢిల్లీ వెళ్లి కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు. -
ఎమ్మెల్యేపై ఫేస్బుక్లో అభ్యంతరకర వ్యాఖ్యలు
హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. తుమ్మల రమేష్ రెడ్డి అనే వ్యక్తి ఫేస్బుక్లో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయటంతో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సైబరాబాద్ పోలీసులు రమేష్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. యూఏఈకి చెందిన ఓ బ్యాంక్ నుంచి రుణం తీసుకుని జీవన్ రెడ్డి ఎగవేసినట్లు, అలాగే ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆర్మూరు ప్రజల్ని జీవన్ రెడ్డి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని రమేష్ రెడ్డి ఫేస్ బుక్‌లో కథనాలు పోస్ట్ చేశాడు. దీంతో తన పరువుకు నష్టం కలిగేలా రమేష్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.