కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా చంద్రబాబుదే... | revanth reddy, errabelli dayakara rao acting in chandrababu direction, says trs mla jeevan reddy | Sakshi
Sakshi News home page

కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా చంద్రబాబుదే...

Published Wed, Nov 12 2014 9:29 AM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM

కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా చంద్రబాబుదే... - Sakshi

కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా చంద్రబాబుదే...

హైదరాబాద్ : తెలంగాణలో కరెంట్ కష్టాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కారణమని నిజామాబాద్ జిల్లా ఆర్మూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆరోపించారు. ఆయన బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ తెలంగాణలో విద్యుత్ సంక్షోభానికి కథ,స్క్రీన్ ప్లే, నిర్మాత, డైరెక్షన్ ....అంతా చంద్రబాబుదే అన్నారు. ఆంధ్ర బాబులు రిమోట్ నొక్కితే తెలంగాణ అసెంబ్లీలో బొమ్మలు ఆడుతున్నాయన్నారు.

మాయల పకీరు ప్రాణం చిలుకలో ఉన్నట్లు ....తెలంగాణ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు ప్రాణాలు ....చంద్రబాబు చేతిలో ఉన్నాయని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రాంత ప్రజల సంక్షేమాన్ని విస్మరించి వారు బాబు డైరెక్షన్లో సభలో చెరోవైపు ప్రభుత్వంపై ఎగరటం సరికాదన్నారు. నీళ్లు, నిధులు, విద్యుత్ అన్ని దోచుకుపోతున్నారనే...తాము తెలంగాణ సాధించుకుంటే ఇప్పుడూ కూడా ఆంధ్రా పెత్తనం చేస్తామంటే సహించేది లేదన్నారు. విద్యుత్ సంక్షోభంపై తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులంతా త్వరలోనే ఢిల్లీ వెళ్లి కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement