అరే ఇదేందన్నా.. ఆపి మరీ తిట్టించుకున్నా.. | Discussion with Congress leadar Sampath Kumar and TRS MLA Jeevan Reddy | Sakshi
Sakshi News home page

అరే ఇదేందన్నా.. ఆపి మరీ తిట్టించుకున్నా..

Published Mon, Mar 21 2016 9:54 AM | Last Updated on Sat, Aug 11 2018 6:42 PM

అరే ఇదేందన్నా.. ఆపి మరీ తిట్టించుకున్నా.. - Sakshi

అరే ఇదేందన్నా.. ఆపి మరీ తిట్టించుకున్నా..

హైదరాబాద్: అసెంబ్లీలో రూల్సా.. రూల్స్ ప్రకారం సభ నడుస్తోందా అని టీఆర్ ఎస్ ఎమ్మెల్యే ఎ.జీవన్ రెడ్డిని కాంగ్రెస్  సభ్యుడు సంపత్ కుమార్ ప్రశ్నించారు. అసెంబ్లీ లాబీల్లో వీరిద్దరూ పరస్పరం ఎదురుపడ్డారు. సంపత్ ను చూసిన జీవన్ రెడ్డి ఆపారు. ' ఇంత పెద్ద మనిషిని, పైగా రూల్స్ కమిటీ సభ్యుడిని ఎదురుపడ్డా పట్టించుకోకుండా పోతావా' అని సంపత్ ను ప్రశ్నించారు. ' మీ ప్రభుత్వంలో రూల్స్, చట్టాలు ఏమైనా ఇక్కడ ఉన్నాయా? మెజారిటీ ఏమనుకుంటే అవే రూల్స్. మైనారిటీలో ఉన్నవాళ్లు మౌనంగా ఉండాల్సిందే . అందుకే చప్పుడు చేయకుండా పోతన్నాం' అంటూ సంపత్ సరదాగా విమర్శించారు. అరే.. ఇదేందన్నా ఆపి మరీ తిట్టించుకున్నట్లయింది అని జీవన్ నవ్వూతూ వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement