
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఓపీ రావత్‌ను కలిశారు. ఈ సందర్భంగా శాసన సభ్యత్వాల రద్దును కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతులను అందచేశారు. అప్రజాస్వామిక రీతిలో తెలంగాణ ప్రభుత్వం తన సభ్యత్వాలను రద్దు చేసిన తీరు, హైకోర్టు ఆ ఉత్తర్వులను రద్దు చేయడాన్ని ఈసీకి వివరించారు. రాజ్యాంగానికి విరుద్దంగా వ్యవహరిస్తూ, ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని వారు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. కోమటిరెడ్డి, సంపత్‌తో పాటు మర్రి శశిధర్ రెడ్డి కూడా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment