
చెన్నై : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న మీటూ ప్రకంపనలు తెలంగాణను తాకాయి. టీఆర్‌ఎస్‌కు చెందిన ఆర్మూర్ తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపైన నటి శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఓ ప్రముఖ తమిళ న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీటూ ఉద్యమం గురించి ఆమె మాట్లాడుతూ..‘ జీవన్ రెడ్డి హైదరాబాద్‌లోని పార్క్‌హయత్ హోటల్‌లో నాపై వేధింపులకు పాల్పడ్డాడు. అతడికి అమ్మాయిలంటే పిచ్చి. అతడు పెద్ద మోసగాడు. అతనికి నిర్మాత బెల్లంకొండ సురేశ్ సహాయం చేశాడు. అతడు ప్రతి రోజు ఫోన్ చేసి వేధింపులకు పాల్పడేవాడు. తమ పార్టీ అధికారంలో ఉందని బెదిరింపులకు దిగేవాడ’ని పేర్కొన్నారు. గతంలో కూడా శ్రీరెడ్డి పలువురు ప్రముఖులపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.