ఆర్మూర్ బిల్దియాలో కలకలం సృష్టించిన కౌన్సిలర్ శంకర్ కిడ్నాప్ కథ ఎట్టకేలకు సుఖాంతమైంది.
నిజామాబాద్ : ఆర్మూర్ బిల్దియాలో కలకలం సృష్టించిన కౌన్సిలర్ శంకర్ కిడ్నాప్ కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. విశాఖలో నిన్న కౌన్సిలర్తో పాటు ఇద్దరు కాంగ్రెస్ నాయకులు బట్టు శంకర్, వందన లక్ష్మినారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక నేపథ్యంలో స్థానిక టీఆర్ఎస్ కౌన్సిలర్ సుంకరి శంకర్ను కాంగ్రెస్కు చెందిన నాయకులు ఆయుధాలతో బెదిరించి కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. కిడ్నాప్కు గురైన కౌన్సిలర్ భార్య స్వప్న ఫిర్యాదు మేరకు ఆరుగురు కాంగ్రెస్ నాయకులు, మాజీ మావోయిస్టులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా కిడ్నాప్కు గురైన కౌన్సిలర్తో పాటు కాంగ్రెస్ నాయకులను వైజాగ్లో గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. నాలుగు బృందాలుగా ఏర్పడిన పోలీసులు సెల్ఫోన్ నెట్వర్క్, సిగ్నల్స్ ఆధారంగా శంకర్ను ఎక్కడకి తీసుకెళ్లారనేది గుర్తించారు. వారిని పోలీసులు నిజామాబాద్ తరలించారు.