అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి సభా స్ఫూర్తిని, గౌరవా న్ని, దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని, ఈ వైఖరికి నిరసనగా గురువారం శాసనసభ సమావేశాలను బహిష్కరించాలని ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయి.
నేడు సభ బహిష్కరణ?
- ఏకతాటిపైకి కాంగ్రెస్, టీటీడీపీ, సీపీఎం
- డోలాయమానంలో బీజేపీ
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి సభా స్ఫూర్తిని, గౌరవా న్ని, దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని, ఈ వైఖరికి నిరసనగా గురువారం శాసనసభ సమావేశాలను బహిష్కరించాలని ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయి. కాంగ్రెస్, టీటీడీపీ, సీపీఎం సభను ఒకరోజుపాటు బహిష్కరిం చనున్నాయి. బుధవారం సభ వాయిదా పడిన అనంతరం కాంగ్రెస్ శాసనసభాపక్షం అత్యవ సరంగా సమావేశమైంది.
ప్రతిపక్ష సభ్యులకు సమస్యలపై మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, వివిధ అంశాలపై పార్టీ వైఖరిని చెప్పే కనీసం సంప్రదాయాన్ని కూడా పాటించడం లేదని నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘సమ స్యపై సంపూర్ణ చర్చకు ప్రతిపక్ష సభ్యులకు మైక్ ఇవ్వడంలేదు. అంశాలపై పార్టీల వైఖరిని సభలో చెప్పడానికి అవకాశం ఇవ్వడంలేదు. సభలో నిరసన చెప్పే ప్రజాస్వామిక సంప్రదాయా న్ని స్పీకర్ పట్టించుకోవడంలేదు. ముఖ్య మంత్రి, మంత్రులు వెకిలిగా మాట్లాడుతుం టే వారించాల్సిందిపోయి నవ్వుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్పీకర్ తీరుకు నిరసనగా సభను ఒకరోజు బహిష్కరించా లని నిర్ణయించాం’’ అని కాంగ్రెస్ సభ్యుడొ కరు వెల్లడించారు. శాసనసభ స్ఫూర్తిని, గౌర వాన్ని కాపాడలేని స్పీకరు తీరుపై ప్రాథమి కంగా నిరసన వ్యక్తం చేయడానికి ఈ నిర్ణ యం తీసుకున్నట్టుగా ఆయన వెల్లడించారు.
కలిసిరానున్న టీటీడీపీ, సీపీఎం
కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం తీసుకున్న బహిష్కరణ నిర్ణయానికి టీటీడీపీ, సీపీఎం మద్దతు ప్రకటించాయి. స్పీకర్ తీరుకు నిరసనగా సభను బహిష్కరించాలని టీటీడీపీ నిర్ణయించింది. బీజేపీతో ప్రతిపక్షపార్టీలు చర్చలు జరుపుతున్నాయి. స్పీకర్ తీరుపై అసంతృప్తిని వెలిబుచ్చిన బీజేపీ సభ్యులు బహిష్కరణపై మాత్రం నిర్ణయాన్ని తీసుకోలేదు. బహిష్కరణ నిర్ణయానికి మద్దతు ఇవ్వాలా, వద్దా అనే దానిపై పార్టీలో ఇంకా చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ వైఖరిపై గురువారం ఉదయానికి స్పష్టత రానుంది.