జమ్మూకశ్మీర్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటు విషయంలో కొద్ది రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు, అనిశ్చితికి, ఊహాగానాలకు తెరపడింది.
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటు విషయంలో కొద్ది రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు, అనిశ్చితికి, ఊహాగానాలకు తెరపడింది. పీడీపీ, బీజేపీల పొత్తు కొనసాగుతుందని, సంవత్సరం క్రితం ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వ ఎజెండానే కొనసాగుతుందని మంగళవారం ఆ రెండు పార్టీలు స్పష్టం చేశాయి. ఇటీవల మరణించిన సీఎం ముఫ్తీ మొహమ్మద్ సయీద్ కుమార్తె, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీనే తదుపరి సీఎం అని, ప్రభుత్వ ఏర్పాటు విషయంలో రెండు పార్టీలు తాజాగా ఎలాంటి షరతులు విధించలేదని వివరించాయి. అయితే, కొత్త ప్రభుత్వ ఏర్పాటు ఎప్పుడున్నదానిపైన సస్పెన్స్ కొనసాగుతోంది.
పీడీపీతో పొత్తులో క్రియాశీలంగా వ్యవహరించిన బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్.. మంగళవారం పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు.