ముఫ్తీకి ముందు నుయ్యి వెనుక గొయ్యి | pdp faces new problem in jammu kashmir | Sakshi
Sakshi News home page

ముఫ్తీకి ముందు నుయ్యి వెనుక గొయ్యి

Published Sun, Jan 4 2015 12:28 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

ముఫ్తీకి ముందు నుయ్యి వెనుక గొయ్యి - Sakshi

ముఫ్తీకి ముందు నుయ్యి వెనుక గొయ్యి

బీజేపీ కోరుకుంటున్నట్లు జమ్మూకశ్మీర్ సీఎం పదవిని హిందువుకు కట్టబెడితే, కశ్మీర్ లోయవాసులకు పీడీపీ తన ముఖం చూపలేదు. పీడీపీ కోరుతున్నట్లు ముస్లింని సీఎంగా నిలిపితే కశ్మీర్ మినహా భారతీయులకు బీజేపీ తన ముఖం చూపించలేదు. గతంలోవలే సీఎం పదవిని ఇరుపార్టీలూ పంచుకోవడమే ఉత్తమం.
 
 జమ్మూకశ్మీర్‌లో ఇటీ వలే ముగిసిన శాసనసభ ఎన్నికలు ఎవరూ ఊహిం చని ఒక అసాధారణ ఫలి తాన్ని అందించాయి. 87 మంది సభ్యులున్న ఆ రాష్ట్ర శాసనసభలో ముఫ్తీ మొహమ్మద్ సయీద్‌కి చెందిన పీపుల్స్ డెమోక్రా టిక్ పార్టీ (పీడీపీ) 28 స్థానాలతో బలమైన శక్తిగా నిలి చింది. గెలిచిన ఏడుమంది స్వతంత్ర అభ్యర్థులను మినహాయిస్తే, 12 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ తతిమ్మా అన్ని పార్టీల కంటే చివరి స్థానంలో నిలిచిం ది. 25 స్థానాలు కైవసం చేసుకున్న భారతీయ జనతా పార్టీ, 15 స్థానాలు గెలిచిన ఒమర్ అబ్దుల్లాకు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ మధ్యలో నిలిచాయి.
 
 ప్రభుత్వ ఏర్పాటుకు పలు అవకాశాలు ఏర్ప డ్డాయి కాబట్టే ఈ ఎన్నికల ఫలితాలను అసాధారణం అన్నాను. బీజేపీ, పీడీపీ కలిసినా, బీజేపీ, ఎన్సీ, కొం దరు స్వతంత్రులు కలిసినా, పీడీపీ, ఎన్సీ, కొందరు స్వతంత్రులు లేదా కాంగ్రెస్ కలిసినా చాలు.. ప్రభు త్వానికి అవసరమైన 44 స్థానాల మెజారిటీని సాధిం చవచ్చు. ఓటర్లు ఎవరికి వారుగా చీలిపోయినందున ప్రభుత్వ ఏర్పాటుకు ఇన్ని అవకాశాలు ఏర్పడటం మన ఎన్నికల్లో అసాధారణం. అయితే వాస్తవంలో ఇన్ని ఐచ్ఛికాలు లేవు. కశ్మీర్ లోయలో అతి పెద్ద పార్టీ లుగా నిలిచిన పీడీపీ, ఎన్సీలు నిజంగానే భాగస్వా ములు కారు. పీడీపీ లేదా నేషనల్ కాన్ఫరెన్స్... ఈ పార్టీలో దేనితో పొత్తు కుదుర్చుకోవాలనే విషయాన్ని బీజేపీనే నిర్ణయించుకోవాల్సి ఉంది.
 
 
 రాష్ట్ర రాజకీయ రంగంలో పీడీపీ, బీజేపీలు పూర్తిగా వ్యతిరేక కొసలో ఉన్నాయి. లోయలో వేర్పా టువాద మనోభావాలున్న అనేకమంది ముస్లింలకు పీడీపీ ప్రాతినిధ్యం వహిస్తోంది. జమ్మూలో హిందు వులకు, జాతీయ మనోభావాల విషయంలో తక్కిన భారత్‌తో ఏకీభావం కలిగిన కశ్మీరీయులకు బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ రెండు పార్టీలకు పూర్తి గా భిన్నమైన నియోజకవర్గాలు, ఓటర్లు ఉన్నారు. పీడీపీ శాసనసభ్యులలో ఒక్క హిందువూ లేరు. అలా గే బీజేపీ శాసనసభ్యుల్లో ఒక్క ముస్లిం కూడా లేరు.
 ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, భారత్ లో అన్నిచోట్లా ఉన్నట్లుగా కశ్మీర్‌లో బీజేపీ పెద్దగా ‘అస్పృశ్యత’ను ఎదుర్కోవడం లేదు. (ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రాభవంతో ఇప్పుడు బీజేపీ అలాంటి పరిస్థితికి దూరమైందనుకోండి) ఈ క్షణంలో అయితే కశ్మీర్‌లో కనుచూపు మేరలో ఏ ప్రభుత్వమూ కానరా లేదు కానీ, వీలైనంత ఉత్తమ ఒప్పందం కోసం పార్టీ లన్నీ తమ తమ ప్రయత్నాలు చేస్తున్నాయి.
 కేవలం గణాంకాల ప్రాతిపదికన చూసినట్ల యితే, పీడీపీతో బీజేపీ అవగాహనకు రావడమన్నదే స్పష్టమైన సమ్మేళనంగా కనబడుతోందని కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ అంగీకరించారు. 87 స్థానా ల అసెంబ్లీలో ఈ రెండు పార్టీలకు కలిసి 53 స్థానాలు న్నాయి. అందుచేత ఈ కూటమికే సుస్థిర మెజారిటీ ఏర్పడుతుందని చెప్పవచ్చు. కేవలం సంఖ్యల వెనుక నేను ఈ స్పష్టమైన అనే పదాన్ని ఎందుకు నొక్కి చెబు తున్నానంటే, ప్రాంతీయ, మతపరమైన పంథాలకు సంబంధించిన కార్యక్రమాలు, లక్ష్యాలలో పొంతన లేకపోవడమే కారణం.
 
 బీజేపీ గెలిచిన మొత్తం 25 స్థానాలూ జమ్మూ ప్రాంతంలోనివేనని మణిశంకర్ స్పష్టం చేశారు. కశ్మీర్‌లో బీజేపీ పోటీ చేసిన 36 సీట్లలో 35 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది. ఇక పీడీపీ జమ్మూలో రెండు స్థానాలు సాధించింది కానీ, ఎన్నికల్లో గెలిచిన మొత్తం 28 సీట్లలో 26 స్థానాలను అది కశ్మీర్ నుంచే సాధించింది. జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వపాలనకు సంబంధించి తమ మధ్య అగాధపూరితమైన దూరం ఉందని ఈ రెండు పార్టీలు తమ ఎన్నికల ప్రచారంలో ప్రదర్శించాయి.
 
 దీన్ని ఒక సమస్యగానే అయ్యర్ గుర్తిస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల ప్రచార సమయంలో, అంతకు ముందు కూడా ఉగ్రవాదంపై పీడీపీ మెతక వైఖరిని ప్రదర్శిస్తున్నదని, రాళ్లు విసురుతున్న ఆందోళనకారు లను అర్థం చేసుకోవడం వైపే అది మొగ్గు చూపుతోం దని బీజేపీ నిందారోపణలు చేసింది. భారత రాజ కీయ పార్టీలన్నింటిలోనూ, ఉగ్రవాదాన్ని, చొరబాటు దారులను తరిమిపారేసే చిత్తశుద్ధి, రాజీలేని ధోరణి కల బలమైన పార్టీ తానేనని ఇటు జమ్మూకశ్మీర్‌లో, అటు దేశం మొత్తంలోనూ తన్ను తాను ప్రదర్శించు కోవడమంటే బీజేపీకి అమితమైన ఇష్టం. జమ్మూ కశ్మీర్ నూతన ప్రభుత్వంలో ఉంటూ ఉగ్రవాద సమ స్యపై బీజేపీ మెతకవైఖరిని అవలంబిస్తే దాన్ని ఆరె స్సెస్, సంఘ్ పరివార్ దండించడం ఖాయం. అంతే కాకుండా ఉగ్రవాదంపై తన వైఖరికి సంబంధించి కశ్మీర్‌లో, తతిమ్మా దేశంలో కూడా అది తన విలువ ను కోల్పోతుంది. మరోవైపున పీడీపీ సమయాను కూలంగా ఉగ్రవాదంపై కఠిన, మృదువైఖరిని అవ లంబిస్తూ వస్తే, కశ్మీర్ లోయలో కొత్తగా తను సాధిం చిన మద్దతును వెనువెంటనే కోల్పోతుంది. అందు కనే పీడీపీ, ఎన్సీ, కాంగ్రెస్ చుట్టూ ఉన్న ఈ ఫాంటసీ చెల్లుబాటవుతుందని నేను భావించడం లేదు.
 
 రెడిఫ్.కామ్ విలేకరి షీలా భట్ నివేదిక ప్రకా రం, పీడీపీతో బీజేపీ చర్చలకు సంబంధించి ఒక సమస్య ఎదురవుతోంది. ఏర్పడబోయే కొత్త ప్రభు త్వానికి హిందువును ముఖ్యమంత్రిగా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోందట. బీజేపీ గేమ్ ప్లాన్‌ను అర్థం చేసుకోవడంలో మంచి అనుభవం కల ముఫ్తీ సయీద్ ఈ డిమాండ్ పట్ల స్పందిస్తూ ఒక బీజేపీ నేతతో ఇలా అన్నారట... ‘మీ డిమాండ్ ప్రకారం శ్రీనగర్‌లో ప్రభుత్వానికి మీ మనిషి నాయకత్వం వహించడాన్ని నేను ఆమోదిస్తే కశ్మీర్ లోయలో ప్రజ లకు నా ముఖం చూపించలేను.’ దానికి బీజేపీ నేత స్పందిస్తూ, ‘మీ డిమాండ్‌ను నేను ఆమోదిస్తే తతిమ్మా భారతీయులకు నా ముఖాన్ని అస్సలు చూపించలేను’ అన్నారని షీలా భట్ నివేదించారు.
 
 ముఖ్యమంత్రులను మతం ప్రాతిపదికన ఎం పిక చేసుకోవడంపై ఎవరికయినా వ్యతిరేకత ఉన్నట్ల యితే, వారు ఒక విషయాన్ని తప్పక గమనించాలి. ఏమంటే, ముస్లింను ముఖ్యమంత్రిగా ప్రకటించ డానికి కూడా బీజేపీకి ఒక్క ముస్లిం ఎంఎల్‌ఏ కూడా లేడు. ఇలా కాదని ముఖ్యమంత్రి పదవిని రెండు పార్టీలూ పంచుకోవలివస్తే కూడా బీజేపీ తరఫున హిందూ అభ్యర్థే బరిలో ఉంటాడు.
 
 అయితే ఇది మరీ అంత చెడ్డ విషయమని నేను భావించడం లేదు. పూర్తిగా భిన్న వైఖరులు కలిగిన రెండు పక్షాల మధ్య భాగస్వామ్యం మంచికే దారి తీస్తుంది. అలాంటి సందర్భాల్లో ఇరువురూ పర స్పరం ప్రభావం చూపించుకుంటారు.
 
 2002 నుంచి 2008 మధ్య కాలంలో (జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ కాలవ్యవధి ఆరేళ్లు) పీడీపీ ఇలాంటి ఒప్పందాన్నే కాంగ్రెస్‌తో కుదుర్చుకుంది. మొదట ముఫ్తీ సయీద్ ముఖ్యమంత్రిగా మూడేళ్లు అధికారం లో ఉండగా, తదుపరి మూడేళ్లూ గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఇప్పుడు బీజేపీతోనూ పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ అలాంటి ఒప్పందాన్ని  కుదుర్చుకుంటే మంచిది.

 

(వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత)
Aakar.patel@icloud.com)


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement