న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ లో పీడీపీ ముందు తమ పార్టీకి కొత్త అధినేతను ఎన్నుకోవాలని బీజేపీ ఎంపీ రామ్ మాధవ్ అన్నారు. ఆ తర్వాతే తామంతా ఓ చోట కూర్చుని మాట్లాడుకొని కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మహ్మద్ సయీద్ మఫ్తీ గత గురువారం తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత అక్కడ ముఖ్యమంత్రి పీఠం ఖాళీ అయింది. మఫ్తీ కూతురు మెహబూబా మఫ్తీ సీఎం బాధ్యతలు చేపడతారని భావించినా అలా జరగలేదు. పీడీపీతో పొత్తుపెట్టుకున్న బీజేపీ కూడా ఇప్పటి వరకు ప్రభుత్వ ఏర్పాటు విషయంలో పీడీపీతో భేటీ కాలేదు. ఈ అంశంపై మీడియా ప్రశ్నించగా రామ్ మాధవ్ ఇలా స్పందించారు.
'ముందు వాళ్లే నిర్ణయించుకోవాలి.. ఆ తర్వాతే మేం'
Published Mon, Jan 11 2016 9:46 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement