
శ్రీనగర్: కశ్మీర్ అంశం ‘రాజకీయ సమస్య కాద’ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర ఆర్థిక మంత్రిపై పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ వేటు వేసింది. ‘ఈ రాష్ట్రం రాజకీయ అంశాలతో కాకుండా సామాజిక సమస్యలతో సతమతమౌతోంద’ని ఆయన అన్నారు. ‘కశ్మీర్-ది వే ఫార్వార్డ్’ అంశంపై శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ద్రాబు ఈ కామెంట్ చేశారు.
గత 70 ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యగా కశ్మీర్ మిగిలిపోవడానికి కారణం రాజకీయాలేనని అన్నారు. ద్రాబు చేసిన వ్యాఖ్యలపై అటు బీజేపీ, ఇటు పీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. అయితే బీజేపీకి అనుకూల ప్రకటన చేశాడంటూ సదరు మంత్రి పై పీడీపీ చర్యలు తీసుకోక తప్పలేదు. తమ ప్రభుత్వంలోని ఆర్థిక మంత్రి హసీబ్ అహ్మద్ ద్రాబుని మంత్రి వర్గం నుంచి తొలంగించాలని గవర్నర్ వొహ్రాని పీడీపీ కోరింది.
Comments
Please login to add a commentAdd a comment