జమ్మూకశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటుకు తొందరపడడం లేదని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ అన్నారు.
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటుకు తొందరపడడం లేదని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ అన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని అవకాశాలను పరిశీలిస్తామని ఆమె చెప్పారు. జమ్మూకశ్మీర్ ప్రజలకు ఏది అత్యుత్తమో అదే చేస్తామన్నారు.
ప్రభుత్వ ఏర్పాటుకు సమయం పడుతుందని తెలిపారు. మంగళవారం వెల్లడైన జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పీడీపీ 28 స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ సంఖ్య 44.