న్యూఢిల్లీ: బీజేపీ కార్యకర్తల కష్టానికి, అంకితభావానికి జార్ఖండ్, కశ్మీర్ ఎన్నికల ఫలితాలు ప్రతిఫలమని ప్రధాని మోదీ ట్వీటర్‌లో పేర్కొన్నారు. ‘రెండు రాష్ట్రాల్లోని కార్యకర్తలకు అభినందనలు. కశ్మీర్‌లో నమోదైన రికార్డు పోలింగ్ ప్రజాస్వామ్యంపై ప్రజల నమ్మకాన్ని చాటింది. బీజేపీపై విశ్వాసాన్ని ఉంచినందుకు కృతజ్ఞతలు. జార్ఖండ్ ప్రజలు స్థిరత్వానికే పట్టంకట్టారు. వారికి కూడా కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు.
మోదీకి చంద్రబాబు అభినందన
సాక్షి, హైదరాబాద్: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినందుకు మోదీని ఏపీ సీఎం చంద్రబాబు అభినందించారు. ఈ ఫలితాలను పరిశీలిస్తే ప్రజలు అభివృద్ధికి ఓటేశారని అర్థమవుతోందని లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ పేర్కొన్నారు.
కార్యకర్తల కష్టానికి ప్రతిఫలం: మోదీ
Published Wed, Dec 24 2014 1:56 AM | Last Updated on Fri, Mar 29 2019 5:33 PM
Advertisement
Advertisement