జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో మంత్రుల సైతం కుదేలయ్యారు. ఏకంగా జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో 15 మంది మంత్రులు ఓటమి పాలైయ్యారు.
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో మంత్రుల సైతం కుదేలయ్యారు. జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో ఏకంగా 15 మంది మంత్రులు ఓటమి పాలైయ్యారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ నుంచి అధికశాతంలో ఎనిమిది మంది మంత్రులు ఓటమి చెందగా, ఎన్సీ(నేషనల్ కాన్పరెన్స్ ) నుంచి ఆరుగురు పరాజయం పాలయ్యారు. డెమోక్రటిక్ పార్టీ నేషనలిస్ట్ పార్టీ నుంచి కూడా ఒక మంత్రి ఈసారి ఎన్నికల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అతికష్టమ్మీద పరువు దక్కించుకున్నారు. సోనావార్, బీర్వా నియోజకవర్గాల నుంచి బరిలో దిగిన ఒమర్ అతి కష్టం మీద బయటపడ్డారు. సోనావార్ నియోజక వర్గంలో 4,700 ఓట్లతో ఓటమి పాలైన ఒమర్.. బీర్వాలో కూడా ఓటమి పాలైనట్లు వార్తలు వచ్చాయి. అయితే 1,000 మార్జిన్ ఓట్లతో ఒమర్ బీర్వాలో విజయాన్ని కైవశం చేసుకున్నారు.
ఓటమి పాలైన మంత్రుల్లో డిప్యూటీ చీఫ్ మినిష్టర్- తారా చంద్(ఎన్సీ), ఆరోగ్య శాఖమంత్రి- తాజ్ మోహిద్దీన్(ఎన్సీ), పర్యాటక శాఖ మంత్రి- గులామ్ అహ్మద్ మిర్(కాంగ్రెస్), అబ్దుల్ రహీమ్ రాథే(ఆర్థిక శాఖ మంత్రి) తదితర ఉద్దండులు ఓటమి చెందారు.