కేంద్రాన్ని కోరుతూ జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం
శ్రీనగర్: సరిహద్దుల్లో ప్రశాంత వాతావరణం నెలకొనేలా పాక్‌తో చర్చలు జరపాలని కేంద్రాన్ని కోరుతూ జమ్మూకాశ్మీర్ శాసనమండలి గురువారం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. భారత ఉపఖండంలో శాంతి నెలకొనేందుకు పాక్‌తో చర్చల ప్రక్రియను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ర్ట ప్రభుత్వం కోరాలన్నది ఈ తీర్మానం సారాంశం. ఈ తీర్మానానికి అధికార నేషనల్ కాన్ఫరెన్స్‌తో పాటు కాంగ్రెస్, పీడీపీ సభ్యులు మద్దతు తెలపగా, బీజేపీ సభ్యులు వ్యతిరేకించారు.
పాక్‌తో చర్చలు జరపాలంటూ జమ్మూకాశ్మీర్ శాసన మండలి చేసిన తీర్మానాన్ని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు తప్పుపట్టారు. వేరే దేశంతో చర్చిండమనేది కేంద్ర పరిధిలోని అంశమని, దీనికి సంబంధించి రాష్ట్రాలు తీర్మానాలు చేయడం వాంఛనీయం కాదన్నారు.
కాశ్మీర్‌పై చర్చలకు సానుకూలమే!
న్యూఢిల్లీ/జమ్మూ: సిమ్లా ఒప్పందం, లాహోర్ ప్రకటన.. ఈ ద్వైపాక్షిక ఒప్పందాల పరిధిలో జమ్మూకాశ్మీర్ అంశాన్ని పాక్‌తో చర్చించేందుకు సానుకూలంగా ఉన్నామని భారత్ స్పష్టం చేసిం ది. కాశ్మీర్ సహా ఇరుదేశాల మధ్య ఉన్న అన్ని వివాదాస్పద అంశాలపై ఆ ఒప్పందాల పరిధిలో చర్చించుకోవచ్చని పేర్కొంది.
కాశ్మీర్ ప్రస్తావన లేకుండా భారత్-పాక్ చర్చలు తమకు ఆమోదయోగ్యం కాదన్న పాక్ వ్యాఖ్యలపై గురువారం భారత విదేశాంగ శాఖ స్పందించింది. సిమ్లా ఒప్పందం ప్రకారం భారత్, పాక్ మినహా మరెవ్వరూ కాశ్మీర్ అంశంలో భాగస్వామ్య పక్షం కాదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అక్బరుద్దీన్ తేల్చిచెప్పారు. కాగా, జమ్మూకాశ్మీర్‌లోని రామ్‌ఘఢ్ సెక్టార్‌లో భారత్, పాక్‌ల మధ్య గురువారం మరోసారి కమాండంట్ స్థాయిలో చర్చలు జరిగాయి.
పాక్‌తో చర్చలు జరపండి!
Published Fri, Aug 29 2014 1:56 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement