
బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్
న్యూఢిల్లీ: పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిసి కశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ వస్తున్న వార్తలను బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ఖండించారు. రాష్ట్రాభివృద్ధి, సుపరిపాలన, శాంతి కోసం తమ పార్టీ గవర్నర్ పాలనకే మొగ్గు చూపుతోందన్నారు.
‘రాం మాధవ్ ప్రకటనతో పనిలేకుండా అక్కడి బీజేపీ ఎమ్మెల్యేలు పీడీపీని చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలన్నదే వారి అభిమతంగా ఉంది’ అంటూ ఒమర్ అబ్దుల్లా మరో ట్వీట్ చేశారు. దీనికి రాం మాధవ్ స్పందిస్తూ..‘అది నిజం కాదు. పార్టీ రాష్ట్ర శాఖతో ఈ విషయమై మాట్లాడతాం. ఇతర పార్టీల్లో ఎలాంటి పరిణామాలు సంభవించినా మేం జోక్యం చేసుకోం’ అని తెలిపారు.