'ఒక్క అడుగు ముందుకు పడలేదు'
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న సస్పెన్స్ కొనసాగుతోంది. బీజేపీ, పీడీపీ మధ్య జరుగుతున్న చర్చల్లో పురోగతి కనిపిచడం లేదు. ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయిద్ మరణం తర్వాత ఆ పదవికి ఆయన కుమార్తెను ఎన్నుకున్నారని, అంతకుమించి ఒక్క అడుగు ముందుకు పడలేదని బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ తెలిపారు.
కశ్మీర్ లో రాజకీయ అనిశ్చితికి తాము కారణంగా కాదని స్పష్టం చేశారు. పీడీపీ కొత్త షరతులకు ఒప్పుకోమని అన్నారు. కొన్ని అంశాలపై స్పష్టత రావాల్సివుందని, అంతవరకు సందిగ్ధం కొనసాగుతుందని రాంమాధవ్ చెప్పారు.